తమిళసినిమా, న్యూస్‌లైన్ : కోచ్చడయాన్ చిత్రం విడుదల అనూహ్యంగా మరోసారి వాయిదాపడింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కోచ్చడయాన్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ అశ్విన్ దర్శకత్వం వహించారు.
భారతదేశంలోనే తొలిసారిగా కాప్చరింగ్ ఫార్మెట్‌లో రూపొందిన 3డి యానిమేషన్ చిత్రం ఇది. హాలీవుడ్ చిత్రాలు అవతార్ టిన్‌టిన్ చిత్రాల తరహాలో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రం విడుదల ఇప్పటికే పలుసార్లు వాయిదాపడుతూ వచ్చింది. అయితే మే నెల 9న చిత్రాన్ని ఖచ్చితంగా విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు వెల్లడించారు. ఆ విధంగా పబ్లిసిటీ కూడా చేస్తూ వచ్చారు.
ఇలాంటి పరిస్థితిలో బుధవారం అనూహ్యంగా చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్టు ఒక ప్రకటన విడుదల చేశారు. కోచ్చడయాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆరువేల ప్రింట్లతో 2డి, 3డి ఫార్మెట్‌లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు అయితే కొన్ని సాంకేతిక కారణాల వలన చిత్రాన్ని ఈ నెల 9న కాకుండా 23న విడుదల చేయనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో సూపర్‌స్టార్ అభిమానులకు మరోసారి నిరాశ ఎదురయ్యిందనే చెప్పాలి.
మళ్లీ వాయిదా
Published Thu, May 8 2014 3:27 AM | Last Updated on Tue, Oct 2 2018 2:44 PM
Advertisement
Advertisement