'ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు' | Premakumari new allegations on SA Ramdas | Sakshi
Sakshi News home page

'ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు'

Published Mon, May 5 2014 9:18 AM | Last Updated on Sat, Sep 2 2017 6:58 AM

'ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు'

'ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు'

 మైసూరు : ప్రేమ పేరుతో మాజీ మంత్రి రామదాసు తనను మోసం చేసినట్లు తాను మీడియా ముందుకు రావడంతో మైసూరు నగరంలో తనకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రేమకుమారి ఆవేదన వ్యక్తం చేశారు.  ఆమె ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..  ఎవరైన ఇల్లు ఇస్తామని అడ్వాన్స్ తీసుకున్నా రెండు, మూడు రోజుల తరువాత అద్దెకు ఇవ్వబోమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రామదాసు అండ చూసుకొని రియల్ ఏస్టేట్ మాఫియానే తనకు అద్దె ఇల్లు లభించకుండా చేస్తోందని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే తాను ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. తమ ఇద్దరి పెళ్లి విషయానికి సంబంధించిన అన్ని వివరాలు, పత్రాలను కోర్టుకు అందజేశానని, ప్రస్తుతం తాను ప్రేమకుమారి కాదని, ప్రేమ రామదాసునని అన్నారు. తాను మైసూరులో  రెవెన్యూ శాఖలో పని చేస్తున్నానని, ఆ కారణంగా తానీ నగరాన్ని వీడటానికి అవకాశం లేదని అన్నారు. తాను జీవిస్తే రామదాసుతో కలిసే జీవిస్తానని తెగేసి చెప్పారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement