ramdasu
-
ప్రియుడి హత్య.. పరువు హత్య కానేకాదు..
సాక్షి, చెన్నై: ‘ఓ ప్రేమజంట కులాంతర వివాహం ఏడేళ్ల క్రితం మూడు గ్రామాల్ని కన్నీటి మడుగులో ముంచింది. వందలాది ఇళ్లు భష్మీపటలం అయ్యాయి. ఆ తదుపరి పరిణామాలతో ప్రియుడు రైలు పట్టాలపై శవంగా తేలడం రాష్ట్రంలో ఓ సామాజిక వర్గాన్ని ఆగ్రహానికి గురి చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిషన్‌ను రంగంలోకి దించక తప్పలేదు. ఎట్టకేలకు ఈ కేసులో ప్రియుడి హత్య పరువు హత్య కానే కాదని, ఇది ఆత్మహత్య అని తేల్చుతూ ఆ కమిషన్ సమర్పించిన నివేదిక ఆదివారం ఓ వెబ్సైట్లో ప్రత్యక్షం అయింది. దర్మపురి జిల్లా చెల్లం కోట్టైకు చెందిన నాగరాజన్ కుమార్తె దివ్య (21), అదే జిల్లా నాయకన్ కోట్టై నత్తం కాలనికి చెందిన ఇళంగోవన్ కుమారుడు ఇలవరసన్ (23)ల ప్రేమ వివా హం ఏడేళ్ల క్రితం రాష్ట్రంలో పెద్ద వివాదానికి దారి తీసింది. కుమార్తె కులాంతర వివాహంతో నాగరాజన్ ఆత్మహత్య చేసుకోవడం రెండు సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టింది. ఆ సామాజిక వర్గాలకు చెందిన రాజకీయ పార్టీలు సైతం కయ్యానికి కాలు దువ్వడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఓ సామాజికవర్గం ఆగ్రహానికి మరో సామాజిక వర్గానికి చెందిన మూడు గ్రామాలు కన్నీటి మడుగులో మునిగాయి. వందలాది ఇళ్లు భష్మీ పటలం అయ్యాయి. ఈ వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. చివరకు ఇరు సామాజిక వర్గాలకు చెందిన పెద్దలు రంగంలోకి దిగి ఈ జంటను విడగొట్టే యత్నం చేశారు. తామిద్దరం కలసి జీవిస్తామని ఈ ప్రేమజంట తొలుత స్పష్టం చేసినా, చివరకు ఏమి జరిగిందో ఏమోగానీ దివ్య మాత్రం తన తల్లి వెన్నంటి వెళ్తున్నట్టుగా కోర్టులో ప్రకటించింది. దివ్య దూరం కావడంతో తీవ్ర మనోవేదనలో ఇలవరసన్ పడ్డాడు. దివ్య తన తల్లి వెంట వెళ్లిన కొద్ది రోజులకు ధర్మపురి ఆర్ట్స్ కళాశాల వెనుక ఉన్న రైల్వే ట్రాక్‌లో ఇలవరసన్ మృతదేహం బయట పడింది. పరువు హత్యే అంటూ దళిత సామాజిక వర్గానికి చెం దిన సంఘాలు, రాజకీయపార్టీలు మరో సా మాజిక వర్గంకు వ్యతిరేకంగా ఆగ్రహాన్ని ప్రదర్శించాయి. ధర్మపురి జిల్లానే కాదు, కృష్ణగిరి, సేలం జిల్లాల్లో సైతం పరిస్థితి ఉద్రిక్తంగా మా రే రీతిలో పరిణామాలు చోటు చేసుకున్నాయి. రంగంలోకి సింగార వేలు కమిషన్.. ఈ కులాంతర ప్రేమ వివాహం, ప్రియుడి అనుమానాస్పద స్థితి వ్యవహారం చివరకు పీఎంకే, వీసీకేల మధ్య వివాదాన్ని రేపే పరిస్థితిని తీసుకొచ్చాయి. దీంతో విచారణ సీబీసీఐడీకి అప్పగించారు. ధర్మపురి కోర్టులో సీబీసీఐడీ చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. ఇలవరసన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా చార్జ్‌షీట్‌లో తేల్చారు. దీనిని ఇలవరసన్ కుటుం బీకులు, దళిత సామాజిక వర్గానికి చెందిన పార్టీలు, సంఘాలు వ్యతిరేకించాయి. దీంతో ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు రిటైర్డ్ జడ్జి సింగార వేలు నేతృత్వంలో ప్రత్యేక కమి షన్ రంగంలోకి దిగింది. ఈ కమిషన్ కొన్నేళ్లుగా విచారణ సాగించి, సమగ్ర సమాచారాలు, ఆధారాలతో నివేదికను సిద్ధం చేసి, గత ఏడాది ఆగస్టులో సీఎం పళనిస్వామికి సమర్పించింది. అయితే, ఆ నివేదికలో ఏమున్నదో అన్నది బహిర్గతం కాలేదు. బయట పెట్టాల్సిందేనని దళిత సామాజిక వర్గానిక చెందిన సంఘాలు, పార్టీలు నినదిస్తూ వచ్చాయి. అయితే, ఆ నివేదిక బయటకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఈ నివేదిక ఓ వెబ్సైట్లో ప్రత్యేక్షం కావడం గమనార్హం. 1300 పేజీలతో తన నివేదికను సింగార వేలు సిద్ధం చేసి సమర్పించారు. వన్నియర్ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గానికి చెందిన వారి వద్ద జరిపిన విచారణ, తటస్థంగా ఉన్న వ్యక్తుల వద్ద సాగించిన విచారణ, వాంగ్మూలం, సేకరించిన వివరాలు అందులో పొందు పరిచారు. ఇలవరసన్ మృతదేహం పడి ఉన్న చోట లభించిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక, వైద్యపరంగా సేకరించిన సమాచారాలు, అన్ని రకాల వివరాలను సేకరించి, వాటి ఆధారంగా ఇలవరసన్ ఆత్మహత్య చేసుకున్నట్టుగా నిర్ధారించి ఉండడం గమనార్హం. దివ్య దూరం కావడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉన్నట్టుగా నివేదికలో తేల్చి ఉన్నట్టుగా వివరాలు ఆ వెబ్ సైట్లో పేర్కొన బడి ఉంది. ఇలవరసన్ మరణం ఆత్మహత్యే గానీ, పరువు హత్య కాదు అని ఆ కమిషన్ స్పష్టం చేసి ఉండడంతో, పీఎంకే నేత రాందాసు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. విడుదల చేసిన ప్రకటనలో తమపై నిందల్ని వేసే విధంగా గతంలో వ్యవహరించిన వాళ్లు, పరువు హత్య కాదని తేలడంతో ఇప్పుడు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమా అని సవాల్ చేయడం గమనార్హం. -
'కొడుకు కోడలు నుంచి విముక్తి కల్గించండి'
హైదరాబాద్: కొడుకు, కోడలు నుంచి విముక్తి కలిగించాలని వృద్ధ దంపతులు ఇంటి ముందు రెండు రోజులుగా న్యాయ పోరాటం చేస్తున్నారు. కొత్తగూడలోని ప్రశాంత్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన కడలి రాందాసు(65) కొండాపూర్ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ 2010లో రిటైర్ అయ్యారు. ప్రశాంత్ నగర్లో 150 చదరపు గజాల స్థలంలో ఇల్లు నిర్మించుకున్నారు. రిటైర్ అయిన వెంటనే మరో రెండు అంతస్తుల ఇల్లు నిర్మించామని రాందాసు తెలిపారు. అందుకుగాను రూ.10 లక్షల వరకూ అప్పు చేయాల్సివచ్చిందని చెప్పారు. రెండంతస్తుల భవనంలో తల్లిదండ్రులు గ్రౌండ్ ఫ్లోర్లో నివసిస్తుండగా.. మొదటి అంతస్తులో పెద్దకొడుకు సుబ్బారావు, కోడలు నాగలక్ష్మీ.. రెండో అంతస్తులో చిన్న కొడుకు నర్సింహారావు, కోడలు నాగ వరలక్ష్మీలు నివసిస్తున్నారు. అయితే పెద్ద కొడుకు ఆస్తి పంపకాలు చేయాలని గొడవపడటమే కాకుండా కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గచ్చిబౌలి పోలీసుల ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పారు. పెద్ద కోడలు, కొడుకుల నుంచి తమకు ప్రాణహాని ఉందన్నారు. వారు ఇళ్లు వదిలి వెళ్లిపోయే వరకూ గేటు ముందే ఉంటామని తెలిపారు. మాకూ న్యాయం చేయండి: సుబ్బారావు మా తాత సంపాదించిన రెండు ఎకరాల పొలం అమ్మి వచ్చిన డబ్బులు, నా భార్య తెచ్చిన రెండు లక్షల కట్నం, 10 కాసుల బంగారంతో ఇళ్లు కట్టారని పెద్ద కొడుకు సుబ్బారావు తెలిపారు. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కూరగాయలు అమ్మి జీవనం సాగిస్తున్నామని, పెన్షన్, ఇంటి అద్దెలో చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదన్నారు. -
రామన్న బడ్జెట్!
సాక్షి, చెన్నై : రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని, పీఎంకే షాడో బడ్జెట్‌ను ఆదివారం విడుదల చేసింది. అన్నదాతకు పెద్ద పీట, విద్యకు అందలం ఎక్కించే విధంగా అందులో అంశాలను పొందుపరిచారు. ఇక, స్థానిక సమరం రాష్ట్రంలో అల్లర్లకు దారి తీస్తాయని ఈసందర్భంగా రాందాసు వ్యాఖ్యానిస్తూ, ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ దాఖలు చేసేందుకు సిద్ధ పడ్డ సమయంలో పీఎంకే తరఫున షాడో బడ్జెట్ ప్రవేశ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. పద్నాలుగో సారిగా ఆదివారం తాము రూపొందించిన బడ్జెట్‌ను పీఎంకే వ్యవస్థాపకుడు రాందాసు చెన్నైలో ప్రకటించారు. ఈనెల 21న రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ దాఖలును పురస్కరించుకుని, తాము సూచించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటే, రాష్ర్ట ప్రగతికి దోహదకారిగా ఉంటుందని ప్రభుత్వానికి రాందాసు సూచించారు. అన్నదాతకు పెద్దపీట వేసే విధంగా, విద్యాభ్యున్నతిని కాంక్షిస్తూ, చార్జీల వడ్డన, పన్నుపోటు లేకుండా, రుణాల కేటాయింపుల మీద దృష్టి పెడుతూ, రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ పెంపు దిశగా తన మాదిరి బడ్జెట్లో వంద అంశాలను రాందాసు పొందుపరిచారు. ప్రధానంగా రాష్ట్రంలో రైతు ఆత్మహత్యల కట్టడికి పంచసూత్రాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల తరహాలో తమిళనాడులోనూ వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టే విధంగా, ఈ ఏడాది అన్నదాతలకు ఎనిమిది వేల కోట్ల మేరకు పంట రుణాల కేటాయింపుల గురించి విశదీకరించారు. అలాగే, వ్యవసాయాభివృద్ధికి ఆ శాఖ మంత్రి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ నియమించే విధంగా సూచనలు ఇచ్చారు. విద్యావ్యాప్తి, మెరుగైన విద్య లక్ష్యంగా ఈ ఏడాది 45 వేల కోట్లు కేటాయించాల్సిన అవశ్యం ఉందని సూచించారు. విద్యుత్ ఉత్పత్తి పెంపు పథకాలు, బస్సు చార్జీల తగ్గింపు అంశాల గురించి వివరించారు. ఇక, ఇదివరకు ప్రకటించిన బడ్జెట్లో జరిగిన కేటాయింపులు, అవి ఏ మేరకు అమలు అయ్యాయో, వాటి తీరు తెన్నులను వివరించాల్సిన అవశ్యం ప్రభుత్వానికి ఉందని, అందుకు తగ్గ ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. బడ్జెట్ తయారీకి ముందుగా ప్రజాభిప్రాయం స్వీకరించే విధంగా మాదిరి బడ్జెట్లో ప్రత్యేక సూచనలు చేశారు. గ్రామసభల నుంచి ఈ అభిప్రాయ సేకరణ సాగాలని పేర్కొన్నారు. మహిళా సంక్షేమం కోసం విభాగాల వారీగా నిధుల కేటాయింపులు, వాటి అమలు తీరును వివరించే విధంగా మరో కొత్త అంశాన్ని షాడో బడ్జెట్‌తో తెరమీదకు తెచ్చారు. అల్లర్లు తథ్యం: షాడో బడ్జెట్ ప్రకటనతో మీడియా ప్రశ్నలకు రాందాసు సమాధానాలు ఇచ్చారు. స్థానిక ఎన్నికలు రాష్ట్రంలో తీవ్ర కల్లోలాన్ని, అల్లర్లను సృష్టించే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఎన్నికల్లో ఎవరు గెలిచినా, సరే రిటర్నింగ్ అధికారులు మాత్రం అన్నాడీఎంకే అభ్యర్థులు గెలిచినట్టుగా ప్రకటించడం ఖాయం అని ఆరోపించారు. ఇందుకు తగ్గ ఆదేశాలు అధికారులకు ఇప్పటికే చేరాయని పేర్కొన్నారు. అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారని ధ్వజమెత్తారు. లక్షలు పోసి ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల్లో అధికారుల తీరు ఆగ్రహజ్వాలను రగల్చడం ఖాయం అని, ఈ పరిణామాలు అల్లర్లకు దారి తీయడం థథ్యం అని హెచ్చరించారు. పీఎంకే అధ్యక్షుడు జీకే మణి, నేతలు ఏకే మూర్తి పాల్గొన్నారు. -
‘గూండా’ చట్టంపై వ్యతిరేకత
సాక్షి, చెన్నై: సైబర్ నేరాలు, లైంగిక దాడులను గూండా చట్టం పరిధిలోకి తీసుకురావడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ సవరణలను పీఎంకే అధినేత రాందాసు తీవ్రంగా ఖండించారు. ఆ సవరణల్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఒకే వ్యక్తిపై పలు కేసులు నమోదైనా, పలు సెక్షన్లు మోపినా, పలు మార్లు జైలుకు వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చినా వారిపై గూండా చట్టం ఇది వరకు నమోదు అయ్యేది. ఏడాది కాలం పాటుగా నాన్‌బెయిల్ వారెంట్‌గా ఉండేది. అయితే, ఇటీవల ఈ చట్టాల్ని పలు విధాలుగా ఉపయోగించే పనిలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం పడింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పేట్రేగుతున్న సైబర్‌నేరాలు, మహిళలపై లైంగిక దాడులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యల్లో పడింది. ఇందులో భాగంగా సైబర్ నేరాలకు పాల్పడేవారిని, లైంగిక దాడులకు పాల్పడేవారిని గూండా చట్టం కింద అరెస్టుకు ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీలో ముసాయిదా సైతం దాఖలు చేసింది. అయితే, ఈ చట్టం లైంగిక దాడుల కేసుల్లో దుర్వినియోగం కావొచ్చన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు రాగానే, ఎలాంటి విచారణ లేకుండా ఈ సెక్షన్ నమోదవుతున్న దృష్ట్యా, వ్యతిరేకత మెుదలైంది. దుర్వినియోగం : పీఎంకే అధినేత రాందాసు శుక్రవారం ఓ ప్రకటనలో ఈ చట్టం నమోదును తీవ్రంగా వ్యతిరేకించారు. లైంగిక దాడులు, సైబర్ నేరాలను ఈ చట్టం పరిధిలోకి తీసుకురావడం ద్వారా దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. తొలి సారిగా నేరం చేశాడంటూ ఒకరిపై ఫిర్యాదు వస్తే, విచారణ లేకుండా ఈ చట్టం నమోదు చేయడం వలన ఏడాది కాలం పాటు అతడు జైలుకు పరిమితం కావాల్సి ఉంటుందన్నారు. చివరకు అతడు నేరం చేయలేదని రుజువు అయితే, ఏడాది జీవితం వృథా అయ్యే పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఉదాహరణ తమ ఎమ్మెల్యే, వన్నియర్ సంఘం నేత కాడు వెట్టి గురు మీద నమోదైన జాతీయ భద్రతా చట్టం, గుండా చట్టాల కేసును పరిగణనలోకి తీసుకోవచ్చని వివరించారు. గురుపై మోపిన కేసులన్నీ చివరకు కోర్టులో కొట్టి వేశారని, అయితే, చేయని తప్పుకు ఆయన శిక్ష అనుభవించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. భారత శిక్షాస్మృతి చట్టంలో లైంగిక దాడులకు మరెన్నో కఠిన శిక్షలు ఉన్నాయని, అలాంటప్పుడు చట్ట సవరణలతో గూండా చట్టం పరిధిలోకి లైంగిక దాడులు, సైబర్ నేరాలను తీసుకురావడం విచారకరంగా పేర్కొన్నారు. తన సవరణలను ప్రభుత్వం రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
'ఇల్లు అద్దెకు ఇవ్వడం లేదు'
మైసూరు : ప్రేమ పేరుతో మాజీ మంత్రి రామదాసు తనను మోసం చేసినట్లు తాను మీడియా ముందుకు రావడంతో మైసూరు నగరంలో తనకు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని ప్రేమకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆదివారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ఎవరైన ఇల్లు ఇస్తామని అడ్వాన్స్ తీసుకున్నా రెండు, మూడు రోజుల తరువాత అద్దెకు ఇవ్వబోమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రామదాసు అండ చూసుకొని రియల్ ఏస్టేట్ మాఫియానే తనకు అద్దె ఇల్లు లభించకుండా చేస్తోందని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే తాను ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఇంటి ముందు ధర్నా చేస్తానని హెచ్చరించారు. తమ ఇద్దరి పెళ్లి విషయానికి సంబంధించిన అన్ని వివరాలు, పత్రాలను కోర్టుకు అందజేశానని, ప్రస్తుతం తాను ప్రేమకుమారి కాదని, ప్రేమ రామదాసునని అన్నారు. తాను మైసూరులో రెవెన్యూ శాఖలో పని చేస్తున్నానని, ఆ కారణంగా తానీ నగరాన్ని వీడటానికి అవకాశం లేదని అన్నారు. తాను జీవిస్తే రామదాసుతో కలిసే జీవిస్తానని తెగేసి చెప్పారు.