► జల్లికట్టు కోసం పట్టు
► నిరసనల హోరు
► నేతల మద్దతు
► ఇరకాటంలో కేంద్రం
సాక్షి, చెన్నై: ఇచ్చిన హామీ మేరకు జల్లికట్టు అనుమతి లక్ష్యంగా ప్రత్యేక చట్టాన్ని శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు తీసుకు రావాల్సిందేనని కేంద్రంపై ఒత్తిడికి రాజకీయ పక్షాలు సిద్ధమవుతున్నారుు. జల్లికట్టు నిర్వాహకులు, క్రీడాకారులు, తమిళాభిమానులు నిరసనల్ని హోరెత్తించేందుకు సిద్ధం అయ్యారు. గురువారం మదురై, దిండుగల్‌లలో నిరసన కార్యక్రమాలు చోటుచేసుకున్నారుు.
నేతలు సైతం జల్లికట్టుకు మద్దతుగా గళం విప్పుతుండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇరకాటంలో పడ్డట్టే. తమిళ సంప్రదాయ, సాహసక్రీడ జల్లికట్లుకు అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు తేల్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా తమకు జల్లికట్టు లేనట్టేనా? అన్న విషయాన్ని తమిళులు జీర్ణించుకోలేకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కపటనాటకాలను కట్టి పెట్టి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సంక్రాంతి పర్వదినం వేళ జల్లికట్టు సందడికి అనుమతి జారీకి తగ్గ చట్టాన్ని తీసుకు రావాల్సిందేనని ఒత్తిడికి ప్రతిపక్షాలు, జల్లికట్టు అభిమానులు, నిర్వాహకులు, క్రీడాకారులు సిద్ధమయ్యారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సాగుతున్న దృష్ట్యా, ఇదే అదునుగా భావించి, ఈ సమావేశాల్లోని చట్టం తీసుకురావాలని కేంద్రంపై ఒత్తిడికి ఆందోళన బాటతో ముందుకు సాగే పనిలో పడ్డారు. గురువారం మదురై, దిండుగల్ జిల్లాల్లో నిరసనలు పలుచోట్ల హోరెత్తారుు. తమ జల్లికట్టు ఎద్దులతో ర్యాలీగా కొన్నిచోట్ల, రాస్తారోకోలతో మరికొన్ని చోట్ల ఈ నిరసనలు సాగారుు. జల్లికట్టు నిర్వాహకుల సంఘం నేతృత్వంలో ఎద్దులతో కలెక్టరేట్‌ను ముట్టడించేందుకు దూసుకెళ్లగా పోలీసులు అరెస్టు చేశారు. దిండుగల్‌లో అరుుతే, ఒప్పారి పేరుతో మహిళలు నిర
సన కార్యక్రమాన్ని నిర్వహించారు. జల్లికట్టు ఎద్దులతో ముందుకు సాగుతూ, ఏడుపులు, పెడబొబ్బలతో ఒప్పారి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ముందు సరైన వాదనల్ని వినిపించిన దృష్ట్యా, పిటిషన్ తిరస్కరణకు గురైందంటూ ఆగ్రహాన్ని ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నారుు.
డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో, తమిళమానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, డీఎండీకే అధినేత విజయకాంత్, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం నేత జి.రామకృష్ణన్ వేర్వేరుగా స్పందిస్తూ జల్లికట్టుకు అనుమతి తప్పనిసరి అని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఆచరణలో పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యల్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. శీతాకాల సమావేశాలు ప్రస్తుతం సాగుతున్న దృష్ట్యా, చట్టం లక్ష్యంగా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక, తమ సీఎం జయలలిత జల్లికట్టు అనుమతి విషయంగా తగిన నిర్ణయం తీసుకుంటారని, ఆందోళన వద్దంటూ అన్నాడీఎంకే అధికార ప్రతినిధి వైగై సెల్వన్ భరోసా ఇచ్చే పనిలో పడ్డారు. తక్షణ పరిశీలనలు సాగుతున్నాయని, సరైన నిర్ణయాన్ని సీఎం తీసుకుంటారని, జల్లికట్టును సాధించుకు వస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు.
కాగా, తమిళనాట ప్రత్యేక చట్టం నినాదం హోరెత్తుతుండడంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇరకాటంలో పడే అ వకాశాలు ఉన్నారుు. ఈ సమావేశాల్లో అత్యవసరంగా చట్టం తీసుకురాని పక్షంలో, తమిళనాట బీజేపీ ఉనికికి ముప్పు తప్పదన్న ఆందోళన బయలు దేరిందని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని రాష్ట్రానికి చెందిన కమలనాథులు ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడుతున్నారుు.
చట్టానికి ఒత్తిడి
Published Fri, Nov 18 2016 2:02 AM | Last Updated on Mon, Sep 4 2017 8:22 PM
Advertisement
Advertisement