వంశధార రిజర్వాయర్ వద్ద ఉద్రిక్తత
హిరమండలం: తమ న్యాయపరమైన సమస్యలు తీర్చిన తర్వాతే వంశధార రిజర్వాయర్ పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. సమీప గ్రామాల నిర్వాసితులు ఆందోళనకు దిగారు. శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో జరుగుతున్న వంశధార రిజర్వాయర్ పనులను గురువారం నిర్వాసితులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ సమస్యలు తీర్చకుండా పనులు ప్రారంభిస్తే.. ఎంతకైనా తెగిస్తామని హెచ్చరించారు.