రాయ్‌లక్ష్మి ఏమైంది? | Raai Lakshmi - Finally found her Valentine? | Sakshi
Sakshi News home page

రాయ్‌లక్ష్మి ఏమైంది?

Published Mon, Feb 16 2015 2:53 AM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM

రాయ్‌లక్ష్మి ఏమైంది? - Sakshi

రాయ్‌లక్ష్మి ఏమైంది?

 ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్న నానుడిని నటి రాయ్‌లక్ష్మి మరోసారి నిజం చేసిందా?.. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోనే కాదు, ఆమె అభిమానుల్లోనూ జరుగుతున్న చర్చ ఇదే. ఇంతకీ ఏమిటి ఆమె గొడవ అంటారా? ఎప్పుడూ ఏదోఒక వివాదంతో వార్తలో ఉండాలని ఆశించే రాయ్‌లక్ష్మి ఈసారి ప్రేమికుల రోజును అందుకు వాడుకున్నారు. ఆమె ఒక గుడ్ న్యూస్.. లవర్స్ డే సందర్భంగా నేను ఎట్టకేలకు ఒక ప్రేమికుడిని కనుగొన్నాను అంటూ తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి ఆమె అభిమానులకు షాక్ ఇచ్చారు.
 
 ఈ విషయాన్ని వాల్లు జీర్ణించుకునేలోపు హా..హా...హాఆ బాగా ఏమారిపోయారా? కొంచెం సమయంలోనే చాలామంది గుండెల్ని రగి లించానా అంటూ మరోసారి తన ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. ఈసారి ఆమె  సినీ వర్గాలు షాక్‌కు గురయ్యారు. ఇదేమిటి నటి రాయ్‌లక్ష్మి ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆమెకేమైంది? అంటూ చర్చించడం మొదలెట్టారు. ఈ అమ్మడికిప్పుడు అవకాశాలు అంతగా లేవు. ముందు అనూహ్యంగా ప్రేమికుడి గురించి నోరు జారి ఆ తరువాత అసలు అవకాశాలు లేకుండా పోతాయేమోనని ఆలోచనలో పడి తను ఈ వ్యాఖ్యల్ని చేయాలనుకున్నారా? లాంటి పలు రకాల చర్చలు రాయ్‌లక్ష్మిపై కోలీవుడ్‌లో సాగుతున్నాయి. ఏదేమైనా ఎప్పుడూ వార్తల్లో ఉండాలనే తన ధ్యేయాన్ని రాయ్‌లక్ష్మి నెరవేర్చుకున్నారని చెప్పవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement