రజనినీ కలుస్తున్నాం - రక్షణ కల్పించండి | Rajinikanth's Lingaa’s distributors claim loss | Sakshi
Sakshi News home page

రజనినీ కలుస్తున్నాం - రక్షణ కల్పించండి

Published Mon, Dec 22 2014 8:28 AM | Last Updated on Sat, Aug 11 2018 6:09 PM

రజనినీ కలుస్తున్నాం - రక్షణ కల్పించండి - Sakshi

రజనినీ కలుస్తున్నాం - రక్షణ కల్పించండి

తమిళసినిమా: ‘‘లింగా చిత్ర నష్టపరిహారం కోరుతూ ఆ చిత్ర హీరో రజనీకాంత్‌ను కలవనున్నాం. తమకు రక్షణ కల్పించండి’’ అంటూ థియేటర్ల యాజమాన్యం శనివారం చెన్నై పోలీసు కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించింది. అందులో వారు పేర్కొంటూ రజనీకాంత్ నటించిన లింగా చిత్రం ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేదన్నారు.

ముఖ్యంగా తిరునెల్వేలి, కన్యాకుమారి ఏరియాలకు 4-20 కోట్లకు లింగా చిత్రాన్ని కొనుగోలు చేయగా ఇప్పటికి కోటిన్నర మాత్రమే వసూలు చేసిందని తెలిపారు. చాలా ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి అని పేర్కొన్నారు. దీంతో థియేటర్ల యాజమాన్యం తీవ్రంగా నష్టం చవిచూడాల్సి వస్తోందన్నారు. ఈ వ్యవహారంలో సోమవారం స్థాని క కోడంబాక్కంలోని శ్రీ రాఘవేంద్ర కల్యాణ మండపంలో రజనీని కలవనున్నట్లు తెలి పారు. అందుకు భద్రతను కల్పించేలా ఏర్పా ట్లు చేయాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement