రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
Published Sun, Nov 24 2013 4:06 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: ఆరణి సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందాడు. కవరపేట సమీపం మేల్‌మదలంబేడు గ్రామానికి చెందిన కార్మెగం(24) పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. పెరియపాళెంలోని బంధువుల ఇంట్లో కార్యక్రమానికి శుక్రవారం రాత్రి వెళ్లాడు. శనివారం ఉదయం తిరిగి వస్తుండగా ఆరణి వద్ద ఓ ప్రైవేటు స్కూలు బస్సు ఢీకొనింది. తీవ్రంగా గాయపడ్డ కార్మెగం అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఆరణి పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విద్యార్థులను ఇంటికి పంపి బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించా రు. కార్మెగం మృతదేహాన్ని పొన్నేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఆరణి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Advertisement
Advertisement