వృథాగా పడి ఉన్న రూ. 20 వేల కోట్లు!
వృథాగా పడి ఉన్న రూ. 20 వేల కోట్లు!
Published Thu, Nov 10 2016 4:38 PM | Last Updated on Wed, Apr 3 2019 5:14 PM
ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకస్మాత్తుగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రభావం మహారాష్ట్రలోని నాసిక్ భారత కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్‌పై తీవ్రంగా చూపింది. ఇక్కడ రూ.500, రూ.1000 చెందిన నోట్లు సుమారు 20 వేల కోట్ల రూపాయలు ముద్రించి సిద్ధంగా ఉంచారు. కాని, ఈ నోట్లను చలామణికి ముందే రద్దు చేయడంతో ప్రింటింగ్ ప్రెస్‌కు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడింది. పెద్ద మొత్తంలో ముద్రించి సిద్ధంగా ఉంచిన ఈ కరెన్సీని ఇటు ప్రెస్‌లో ఉంచడానికి, అటు బయటకు పంపడానికి వీలులేకపోవడంతో కాల్చి బూడిద చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
నాసిక్ ప్రింటింగ్ ప్రెస్‌లో ఏడాది నుంచి రూ.1000 నోట్లు ముద్రిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియా నేపథ్యంలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఇక్కడ పెద్ద మొత్తంలో నోట్లు ముద్రిస్తున్నారు. కాని, ఇందులో కొన్ని నోట్లలో భద్రతా దారం (సెక్యూరిటీ థ్రెడ్) లేకపోవడం, అక్షర దోషాలు, రంగులో తేడాలు... తదితర తప్పులు దొర్లడంతో వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. ఇందుకు బాధ్యులెవరనే విషయం తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగాగా ఓ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఇది మర్చిపోక ముందే తాజాగా ప్రభుత్వం రూ. 500, 1000 నోట్లను రద్దు చేయడంతో ప్రింటింగ్ ప్రెస్‌పై అదనపు భారం పడినట్లయింది.
Advertisement
Advertisement