పిల్లలతో మరుగుదొడ్డి శుభ్రం చేయించారు | School Students Cleaned Bathrooms In Karnataka | Sakshi
Sakshi News home page

పిల్లలతో మరుగుదొడ్డి శుభ్రం చేయించారు

Published Fri, Jul 13 2018 8:17 AM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

School Students Cleaned Bathrooms In Karnataka - Sakshi

పాఠశాల మరుగుదొడ్డి శుభ్రం చేస్తున్న పిల్లలు

శివాజీనగర: పాఠశాల విద్యార్థులతో మరుగుదొడ్డి శుభ్రం చేయించిన సంఘటన బెళగావి జిల్లా హుక్కేరి తాలూకా శిరడాణ క్రాస్‌ ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. విద్యార్థులను ఇతర పనులకు ఉపయోగించుకోవటం నేరమని తెలిసినా కూడా ఈ పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలతో మరుగుడొడ్లు పరిశుభ్రం చేయించే సాహసానికి ఒడిగట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ కావడంతో ఉపాధ్యాయుల మెడకు చిక్కుకుంది.

జిల్లా ఉన్నతాధికారులకు విషయం తెల్సినా కూడా ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బీఈఓ ఉమాదేవిని అడగ్గా పిల్లలే స్వచ్ఛందంగా వచ్చి శుభ్రం చేశారని, ఈ విషయం ఉపాధ్యాయులు, స్థానికులు చెప్పారని ఆమె సమర్థించుకున్నారు. ఈ సంఘటనకు కారకులైన ప్రధానోపాధ్యాయుడు,, ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement