శంకర్ మాటిచ్చారు | Senthil Kumar Shankar Vizhi Moodi yosithal | Sakshi
Sakshi News home page

శంకర్ మాటిచ్చారు

Published Sun, Dec 21 2014 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM

శంకర్ మాటిచ్చారు

శంకర్ మాటిచ్చారు

 యువత తమ ప్రతిభకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి అద్భుతాలు సృష్టిస్తున్న రోజులివి. ఇంతకుముందు 10, 15 ఏళ్లు సహాయ దర్శకులుగా పనిచేసిన తర్వాతనే దర్శకులమయ్యేవారు. ఇప్పటి తరం వారు రెండు మూడేళ్లు ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొంది నేరుగా మెగాఫోన్ పట్టేస్తున్నారు. వినూత్న శైలిలో సరికొత్త ఆలోచనలతో చిత్రాలను తెరపై ఆవిష్కరిస్తున్నారు. అలా తెర వెనుక, తెర ముందు ప్రతిభను చాటుకున్న యువకుడు కేజీ.సెంథిల్‌కుమార్. ఈ తిరుపూర్ యువకుడు హాలీవుడ్‌లోని న్యూయార్క్ ఫిలిం అకాడమీ మూడేళ్లు శిక్షణ పొందారు. తర్వాత ఇరవైకి పైగా షార్ట్ ఫిల్మ్‌లు చేశారు. వీటిలో కొన్ని అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు అందుకున్నాయి
 
 ఆ అనుభవంతో కథ, దర్శకత్వం, నిర్మాత, కథా నాయ కుడు అన్నితానై తమిళంలో విళిమూడి యోసిత్తాల్ అనే చిత్రాన్ని తెరపై ఆవిష్కరించారు. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించానన్నారు సెంథిల్‌కుమార్. తన చిత్రం రజనీకాంత్ లింగా ధాటికి తట్టుకుని ఇంకా నగరంలో నాలుగైదు థియేటర్లలో ప్రదర్శితమవుతోందని సంతోషం వ్యక్తం చేశారు. ఎఆర్.మురుగదాస్ తొలి చిత్రం తీస్తే ఎలా ఉంటుందో అలా తన చిత్రం ఉందని పత్రికల వారు ప్రశంసించారని అన్నారు. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు నటిస్తే గజిని చిత్రం అంత విజయం సాధించేదని పలువురు అన్నారని తెలిపారు. విళిమూడి యోసిత్తాల్ రొమాంటిక్ థ్రిల్లర్‌తో కూడిన రివెంజ్ కథా చిత్రమన్నారు. తన చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు శంకర్ చూస్తానని చెప్పడం ఆనందంగా ఉందన్నారు.
 
 తెలుగులో చేయాలని ఉంది.  
 తమిళంలో తానే హీరోగా, దర్శక, నిర్మాతగా తెరకెక్కించిన చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయూలనుందని సెంథిల్‌కుమార్ అన్నారు. తెలుగులో ప్రభాస్, మహేష్‌బాబు, అల్లు అర్జున్‌లలో ఎవరు నటించినా ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఆ ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement