నౌకల యాజమాన్యాల్లో స్పందన కరువు
Published Wed, Aug 28 2013 3:32 AM | Last Updated on Fri, Sep 1 2017 10:10 PM
సేతు సముద్రం ప్రాజెక్ట్‌కు మంగళం పాడే యోచనలో కేంద్రం ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే ఇప్పటివరకు ఖర్చు పెట్టిన రూ.831 కోట్లు వృథా కానున్నాయి. ఒక వేళ ఈ ప్రాజెక్ట్ అమలైనా లాభాన్ని తొమ్మిదేళ్ల తర్వాత చూడాల్సిందే. ఈ వివరాలన్నీ సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చాయి.
సాక్షి, చెన్నై: భారత్ నుంచి ఇతర దేశాలకు నౌకాయానం కష్టతరంగా ఉంటోంది. నౌకలు శ్రీలంకను చుట్టి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో 424 నాటికల్ మైళ్లు వృథాగా పయనించాల్సి వస్తోంది. ఇందుకు 30 గంటలు పడుతోంది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్రం సేతు సముద్రం ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.2,447.40 కోట్లు. ఈ పనులను ప్రధాని మన్మోహన్‌సింగ్ 2005లో ప్రారంభించారు. మూడేళ్లలో పనుల్ని ముగించి 2009 నాటికి నౌకాయానాన్ని సులభతరం చేయడం లక్ష్యంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం 300 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల లోతుతో, 167 కి.మీ దూరం కాలువ తవ్వే పనుల్ని వేగవంతం చేశారు.
అయితే రామసేతు వంతెన అడ్డుపడడంతో వ్యవహారం కోర్టుకు చేరింది. పనుల్ని నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆది నుంచి ఈ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న జయలలిత తాజాగా తన దృష్టిని రామసేతు మీద పెట్టారు. రాముడు నిర్మించిన వంతెనను జాతీయ పురాతన చిహ్నంగా ప్రకటించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. అసెంబ్లీ తీర్మానంతో కోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేశారు. మరోవైపు సేతు ప్రాజెక్టు సాధనే లక్ష్యంగా డీఎంకే ఉద్యమిస్తోంది. ఆది నుంచి అడ్డంకులు ఎదురవుతున్న ఈ ప్రాజెక్ట్‌కు మంగళం పాడేయూలన్న యోచనలో కేంద్రం ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇలా వెలుగులోకి
కాంచీపురానికి చెందిన తమిళ ప్రజల సంస్కృతి కళగం నిర్వాహకుడు కె.ఆర్.రవి సేతు సముద్రం ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. ప్రాజెక్ట్ నిర్మాణం, దీని ద్వారా చేకూరే లాభాలు, వాటాలు తదితర వివరాల కోసం సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రరుుంచారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు, వివరణలు ఇస్తూ సేతు సముద్రం ప్రాజెక్ట్ కార్పొరేషన్ ఉన్నతాధికారి నిధి మురళీధరన్ లేఖ పంపించారు. సేతు పనుల కోసం ఇప్పటివరకు రూ. 831.80 కోట్లు ఖర్చయ్యూయని పేర్కొన్నారు. మూడేళ్లలో పనులు ముగించాల్సి ఉందన్నారు. అయితే వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా పనులు ఆగాయని వివరించారు. ఈ ప్రాజెక్ట్ అమలైన పక్షంలో నౌకా యాజమాన్యాలకు ఇంధనం ఖర్చు, ప్రయూణ సమయం తగ్గుతుందని వివరించారు. అయితే ఈ మార్గంలో పయనించేందుకు నౌకాయూన సంస్థలు ఏ ఒక్కటీ ఇంత వరకు నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్ అమలైనా లాభాన్ని ఆర్జించేందుకు తొమ్మిదేళ్లు పడుతుంద న్నారు. అలాగే పబ్లిక్ రంగం సంస్థలకు వాటాల్ని పంచేందుకు 22 ఏళ్లు పట్టడం ఖాయమని వివరించారు. ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తే నష్టాలు తప్పవంటూ పరోక్షంగా పేర్కొనడం గమనార్హం. ఈ దృష్ట్యా ప్రాజెక్ట్‌కు స్వస్తి చెప్పేందుకు కేంద్రం మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గ్రామసభల్లో తీర్మానాలు
సేతు సముద్రం ప్రాజెక్ట్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలోని సముద్రతీర జిల్లాల్లోని సరిహద్దు గ్రామాల్లో నిరసన వ్యక్తమవుతోంది. గాంధీ జయంతి రోజున సేతుకు వ్యతిరేకంగా గ్రామసభల్లో తీర్మానం చేయడానికి సముద్రతీర పంచాయతీల పాలక మండళ్లు సన్నద్ధమవుతున్నాయి. అలాగే రాముడి వంతెన, జలజీవరాశులకు నిలయంగా ఉన్న మన్నార్ వలై గుడాను పురాతన చిహ్నాలుగా ప్రకటించాలన్న నినాదాన్ని తెర మీదకు తేనున్నాయి.
Advertisement
Advertisement