- అత్యాచారాల్లో మూడో స్థానం
- 2013లో మొత్తం 80 అత్యాచారాలు.. అందులో 46 మైనర్ బాలికలపైనే
- సభలో నోరు మెదపని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి
- బాధితులను కనీసం పరామర్శించని రాష్ట్ర మహిళా కమిషన్
సాక్షి, బెంగళూరు : నగరంలో రోజురోజుకూ అత్యాచారాల సంఖ్య పెరుగుతోంది. మృగాళ్ల వికృత చేష్టలకు అభం శుభం ఎరుగని చిన్నారులు బలవుతున్నారు. దేశంలో 53 నగరాల్లో జరిగిన అత్యాచార గణాంకాలను జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) సేకరించింది.
అందులో బెంగళూరు మూడో స్థానంలో ఉంది. 2013లో బెంగళూరులో మొత్తం 80 అత్యాచారాలు నమోదు కాగ అందులో 46 (57 శాతం) మైనర్ బాలికల పై జరిగినవే. అంటే అత్యాచార బాధితుల్లో అభం శుభం తెలియని చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాష్ర్టంలో రోజుకొక అత్యాచారం జరుగుతున్నా..
మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ మాత్రం మూడు రోజులుగా ఈ విషయంపై నోరు కూడా మెదపడం లేదు. శుక్రవారం కూడా శాసనసభలో కనీసం తన విచారాన్ని కూడా వ్యక్తం చేయలేదు. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బాధితులను పరామర్శించలేదు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల పట్ల మన మంత్రులు, అధికారులకు ఎంత నిబద్ధత ఉందో వీటిని చూస్తే అర్థమౌవుతుంది.