State Womens Commission
-
‘మహిళా సంరక్షణ కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోంది’
సాక్షి,అమరావతి: మహిళా సాధికారత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫాలితాలు ఇస్తున్నాయని మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దిశ చట్టం ద్వారా మహిళలపై జరుగుతున్న దాడులు అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. దిశ చట్టం అమలుకై కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని తెలిపారు. దిశ పేపర్లను లోకేష్ కాల్చేసిన సమయంలో చాలా బాధగా అనిపించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు మహిళా అధికారి పై బహిరంగంగా దాడి చేసినా చర్యలు లేవని, అయితే మహిళా సంరక్షణ కోసం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని పేర్కొన్నారు. మహిళలు ముఖ్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, స్మార్ట్ ఫోన్ల వినియోగ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వీటిపై త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కళాశాలలు, పాఠశాలలో అవగాహన కూడా కల్పిస్తామన్నారు. ఆపద సమయంలో దిశ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలుపుతూ.. రాష్ట్రాలు దాటి ఢిల్లీలో దిశ యాప్ ద్వారా జిల్లాకి చెందిన మహిళను సురక్షితంగా కాపాడిన ఘటనను ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. చదవండి: ఆ.. పిల్లలను ఆదుకుంటాం -
ఆ.. పిల్లలను ఆదుకుంటాం
ఆత్మకూరు: భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడిన మెప్మా రిసోర్స్‌పర్సన్ మొద్దు కొండమ్మ పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో భర్త కిరాతకానికి బలైన కొండమ్మ కుటుంబీకులను వాసిరెడ్డి పద్మ గురువారం పరామర్శించారు. చిన్నారులైన కొండమ్మ కుమారులు ధనుష్, తరుణ్‌తో పాటు తల్లి పెంచలమ్మను, సోదరులను ఆమె ఓదార్చారు. కొండమ్మ కుమారుడు తరుణ్ గుండెజబ్బుతో బాధపడుతున్న విషయం తెలుసుకుని వైద్యపరీక్షలు నిర్వహించేలా చూడాలని ఐసీడీఎస్ పీడీ రోజ్‌మాండ్‌ను ఆదేశించారు. అనంతరం మునిసిపల్ కార్యాలయంలో పద్మ విలేకరులతో మాట్లాడారు. భార్యను ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించడంతో పాటు ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి పలువురికి పంపడం హేయమైన చర్య అన్నారు. అదే క్రమంలో వైజాగ్‌లో దివ్యాంగురాలిపై జరిగిన ఘటనను గుర్తు చేస్తూ.. నిందితులు ఏ పార్టీ వారైనా కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జెల లక్ష్మి, కమిషన్ డైరెక్టర్ కె.సూయజ్, ఆర్డీవో చైత్ర వర్షిణి, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, చైర్పర్సన్ వెంకటరమణమ్మ పాల్గొన్నారు. -
అలాంటి ఘటనలను తీవ్రంగా పరిగణిస్తాం
సాక్షి, అమరావతి: బాలికలపై కన్నతండ్రే అఘాయిత్యాలకు పాల్పడుతుండటం ఘోరమని, ఇటువంటి దారుణాలను తీవ్రంగా పరిగణిస్తామని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. పోషకాహార మాసోత్సవాల సందర్భంగా బుధవారం విజయవాడలోని జిల్లా జైలును సందర్శించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. బాలికలు, మహిళలకు సొంతింట్లోనూ భద్రత లేని పరిస్థితులను తీవ్రంగానే పరిగణించాల్సి వస్తుందన్నారు. ఈ విషయంలో పోక్సోకు మించిన ప్రత్యేక కఠిన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల మహిళా సమస్యలను కొందరు రాజకీయాలకు వాడుకోవాలనే దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వ హయాంతో పోల్చుకుంటే ప్రస్తుతం రాష్ట్రంలో మహిళా భద్రత బాగుందన్నారు. -
చంద్రబాబు తీరుపై రాష్ట్ర మహిళా కమీషన్ ఆగ్రహం
-
పాప ఎవరికి ?
-
అందరూ శిక్షార్హులే!
సాక్షి, మహబూబాబాద్: చిన్నారి తన్విత దత్తత కేసులో మహబూబాబాద్ జిల్లా పోలీసులు దర్యాప్తు పూర్తిచేశారు. కన్నతల్లికి తెలిసే ఆ పాపను అమ్మారని నిర్ధారణకొచ్చిన పోలీసులు అటు కన్నతల్లిదండ్రులు, ఇటు పెంచిన తల్లిదండ్రులూ శిక్షార్హులేనని నిర్ణయించి, తదుపరి చర్యల నిమిత్తం మహబూబాబాద్ కోర్టుకు నివేదించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం చిన్నకృష్ణాపురానికి చెందిన మాలోతు బావ్‌సింగ్, ఉమ దంపతుల కూతురును రెండేళ్ల క్రితం భద్రాద్రి జిల్లా ఇల్లందు మండలం రోంపేడుకు చెందిన రాజేంద్రప్రసాద్, స్వరూప దంపతులకు దత్తత ఇచ్చారు. తన భర్త తనకు తెలియకుండా దత్తత ఇచ్చాడని ఉమ గత నెలలో ఇల్లెందు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైన విషయం తెలిసిందే. భద్రాద్రి పోలీసులు ఈ కేసులో దర్యాప్తును చేపట్టి, రెండేళ్ల పాపను ఖమ్మంలోని శిశుగృహంలో ఉంచారు. ఈ క్రమంలో తన్వితను తనకే అప్పగించాలని కన్నతల్లి ఉమ, పెంచిన తల్లి స్వరూప పోరాడుతున్నారు. కాగా, తన్విత మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జన్మించిందని, అక్కడే దత్తత జరిగిందని భద్రాద్రి జిల్లా పోలీసుల దర్యాప్తులో తేలడంతో, అక్కడి పోలీసులు కేసును మహబూబాబాద్ జిల్లా పోలీసులకు అప్పగించారు. ఎస్పీ కోటిరెడ్డి కేసు దర్యాప్తు చేపట్టారు. మహబూబాబాద్ పట్టణ పోలీసులు కూడా సదరు ప్రైవేటు ఆస్పత్రిలో విచారణ జరిపారు. తన్విత కన్నతల్లి ఉమకు తెలిసే ఈ దత్తత జరిగిందని, ఆ సమయంలో రాసిన ఒప్పందపత్రంలో చేసిన సంతకం ఉమదేనని విచారణలో నిర్ధారించారు. తన్వితను బాగా చూసుకోవడం లేదనే ఫిర్యాదు చేశా.. బావ్‌సింగ్, ఉమ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. మళ్లీ ఉమకు ఆడపిల్లే పుడుతుందని లింగనిర్ధారణ పరీక్షల్లో గ్రహించిన బావ్‌సింగ్ అబార్షన్ కోసం ప్రయత్నించాడు. అది తల్లీ బిడ్డలకు ప్రమాదమని వైద్యులు చెప్పారు. ఇదే సమయంలో ఆడపిల్ల కోసం ప్రయత్నిస్తున్న రాజేంద్రప్రసాద్, స్వరూప దంపతులకు వీరు తారసపడ్డారు. ఇందులో ఓ ఆర్ఎంపీ వైద్యుడు మధ్యవర్తిత్వం వహించాడు. తన్విత జన్మించాక వారికి అప్పగించి ఒప్పందపత్రం రాసుకున్నారు. దీనిపై పోలీసులు ఆర్‌ఎంపీతోపాటు బావ్‌సింగ్, ఉమలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పడంతో, ఉమ కేసును వాపసు తీసుకుంటానన్నారు. గుంటూరుకు చెందిన ఉన్నత కుటుంబానికి దత్తత ఇస్తున్నట్టు తనకు చెప్పారని, వీరు బాగా చూసు కోకపోవడం వల్లే పోలీసులకు ఫిర్యాదు చేశానని వాంగ్మూలమిచ్చారు. కోర్టు తీర్పు మేరకు పాప అప్పగింత దర్యాప్తును పూర్తి చేసిన పోలీసులు మహబూబాబాద్ కోర్టులో నివేదించారు. ఈ కేసులో కన్న తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు, ఆర్ఎంపీ వైద్యుడు కూడా శిక్షార్హులేనని నిర్ధారణకొచ్చిన పోలీసులు, ఐసీడీఎస్ అధికారులు కోర్టు ఆదేశాల మేరకు చర్యలకు సిద్ధమవుతున్నారు. తన్వితను కోర్టు ఆదేశాల ప్రకారం ఎవరికీ అప్పగించమంటే, వారికి అప్పగిస్తామని జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. తన్విత బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి చిన్నారి తన్విత పోషణ బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ టి.వెంకటరత్నం అన్నారు. తన్వితను ఒకవేళ కన్నతల్లికి అప్పగించినా.. పోషించుకునే ఆర్థిక స్థోమతలేని ఆమె మళ్లీ అమ్ముకోదనే నమ్మకం లేదన్నారు. – డాక్టర్ వెంకటరత్నం, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ -
నర్సాపూర్ టు నరసాపురం...ఓ మైనర్ ప్రేమకథ
నరసాపురం : ఓ బాలిక ప్రేమకథ తెలంగాణలోని మెదక్ జిల్లా నర్సాపూర్ నుంచి పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం చేరింది. ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టడంతో ప్రేమికుడు జైలులో మగ్గుతుండగా, పెద్దలు నిర్ణయించిన పెళ్లి ఇష్టంలేక బాలిక పారిపోయి వచ్చి పాలకొల్లు మహిళా మండలిని ఆశ్రయించింది. దీంతో వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. వారి చొరవతో బాలిక ఉదంతం నరసాపురంలోని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి దృష్టికి వెళ్లింది. ఈ కేసులో బాలికకు, యువకుడికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని రాజ్యలక్ష్మి వెల్లడించారు. అసలేం జరిగిందంటే.. మెదక్ జిల్లాలోని నర్సాపూర్‌కు చెందిన బాలిక(16) సంగారెడ్డిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న సాకా సందీప్(22)తో ప్రేమలో పడింది. సందీప్ స్వస్థలం పాలకొల్లు. తల్లిదండ్రులు బాలచంద్రుడు, ఇందిర చాలాకాలం క్రితం మెదక్ వెళ్లిపోయారు. అక్కడ బాలచంద్రుడు ట్రాక్టర్ నడుపుకుని జీవిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సందీప్, బాలికను తీసుకుని పాలకొల్లు వచ్చేశాడు. దీంతో సందీప్‌పై బాలిక తల్లిదండ్రులు సంగారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో కేసుపెట్టారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. సందీప్ సంగారెడ్డి సబ్‌జైలులో 20 రోజులుగా రిమాండ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో బాలిక మైనర్ అయినా ఆమె తండ్రి పెళ్లి చేయడానికి యత్నించడంతో, బాలిక మళ్లీ ఇంట్లోనుంచి పారిపోయి పాలకొల్లు శ్రీ లలితా మహిళా మండలిని ఆశ్రయించింది. వారు ఆమెను అక్కున చేర్చుకున్నారు. బుధవారం ఆమెను నరసాపురంలోని సభ్యురాలు డాక్టర్ ఎస్.రాజ్యలక్ష్మి వద్దకు తీసుకొచ్చారు. అలాగే సందీప్ తల్లిదండ్రులు బాలచంద్రుడు, ఇందిర కూడా వచ్చారు. తమ కుమారుడిపై అన్యాయంగా కిడ్నాప్, రేప్ కేసు పెట్టి జైల్లో పెట్టారని, న్యాయం చేయాలని రాజ్యలక్ష్మికి వినతిపత్రం ఇచ్చారు. బాలిక మైనర్ కావడంతో, తల్లిదండ్రులు వచ్చే వరకూ బాలిక సంరక్షణను లలితా మహిళా మండలి సభ్యులు తీసుకున్నారు. రాజ్యలక్ష్మి మాట్లాడుతూ న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని అటు సందీప్‌కు అన్యాయం జరక్కుండా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మహిళా మండలి అధ్యక్షురాలు నడింపల్లి అన్నపూర్ణ, కార్యదర్శి పసుపులేటి వెంకటలక్ష్మి, ఉఫాధక్షురాలు కుసుమ ఝాన్సీ, ఎం.విజయలక్ష్మి, పి.లక్ష్మీవిమల పాల్గొన్నారు. -
సిలికాన్ సిటీ.. సిగ్గు సిగ్గు
అత్యాచారాల్లో మూడో స్థానం 2013లో మొత్తం 80 అత్యాచారాలు.. అందులో 46 మైనర్ బాలికలపైనే సభలో నోరు మెదపని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి బాధితులను కనీసం పరామర్శించని రాష్ట్ర మహిళా కమిషన్ సాక్షి, బెంగళూరు : నగరంలో రోజురోజుకూ అత్యాచారాల సంఖ్య పెరుగుతోంది. మృగాళ్ల వికృత చేష్టలకు అభం శుభం ఎరుగని చిన్నారులు బలవుతున్నారు. దేశంలో 53 నగరాల్లో జరిగిన అత్యాచార గణాంకాలను జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీఆర్బీ) సేకరించింది. అందులో బెంగళూరు మూడో స్థానంలో ఉంది. 2013లో బెంగళూరులో మొత్తం 80 అత్యాచారాలు నమోదు కాగ అందులో 46 (57 శాతం) మైనర్ బాలికల పై జరిగినవే. అంటే అత్యాచార బాధితుల్లో అభం శుభం తెలియని చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. రాష్ర్టంలో రోజుకొక అత్యాచారం జరుగుతున్నా.. మహి ళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉమాశ్రీ మాత్రం మూడు రోజులుగా ఈ విషయంపై నోరు కూడా మెదపడం లేదు. శుక్రవారం కూడా శాసనసభలో కనీసం తన విచారాన్ని కూడా వ్యక్తం చేయలేదు. ఇక రాష్ట్ర మహిళా కమిషన్ కూడా బాధితులను పరామర్శించలేదు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల పట్ల మన మంత్రులు, అధికారులకు ఎంత నిబద్ధత ఉందో వీటిని చూస్తే అర్థమౌవుతుంది.