7 నుంచి లక్ష్మీనరసింహుడి వార్షిక ఉత్సవాలు
Published Fri, Apr 28 2017 2:55 PM | Last Updated on Tue, Sep 5 2017 9:55 AM
యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక ఉత్సవాలు మే 7వ తేదీ నుంచి జరగనున్నాయని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయన్నారు. మే 7న స్వస్తి వచనం, లక్ష కుంకుమార్చన, 8 న లక్ష పుష్పార్చన, 9 న సహస్ర కలశాభిషేకం ఉంటాయని వివరించారు. ఈ మూడు రోజులపాటు నిత్య కల్యాణం, సుదర్శన హోమం రద్దు చేసినట్లు ఈవో తెలిపారు
Advertisement
Advertisement