ustavalu
-
వచ్చే నెల తిరుమలలో పలు విశేష ఉత్సవాలు
సాక్షి, తిరుమల: వచ్చే నెలలో తిరుమలలో పలు విశేష పూజలు, ఉత్సవాలు జరగనున్నట్లు దేవస్థానం అర్చకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన వివరాలను తిరుమల అధికారులు మంగళవారం తెలిపారు. అవి: నవంబర్ 14న దీపావళి ఆస్థానం; నవంబర్ 18న నాగుల చవితి; నవంబర్ 20న పుష్పయాగానికి అంకురార్పణ; నవంబర్ 21న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం; నవంబర్ 25న స్మార్త ఏకాదశి; నవంబర్ 26న మధ్య ఏకాదశి, క్షిరాబ్ది ద్వాదశి, చాతుర్మాస వ్రత సమాప్తి, చక్రతీర్థ ముక్కోటి; నవంబర్ 27న కైశిక ద్వాదశి ఆస్థానం; నవంబర్ 29న కార్తిక దీపం, తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర. -
దసరా ఉత్సవాలు: రోజుకు 10వేల భక్తులు మాత్రమే!
సాక్షి, విజయవాడ: దసరా ఉత్సవాల్లో భాగంగా అన్ని శాఖలతో సమన్వయ సమావేశాలు నిర్వహించామని విజయవాడ కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నవరాత్రులలో ప్రతి రోజు 10 వేల మంది ఆన్లైన్ టికెట్ తీసుకున్న భక్తులనే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని స్ఫష్టం చేశారు. మూల నక్షత్రం రోజు 13 వేల మంది భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. 10 సంవత్సరాలు, 60 సంవత్సరాల వయసు పైబడిన వారిని దర్శనానికి అనుమతించబోమన్నారు. మొదటి రోజు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటలకు వరకు అమ్మవారి దర్శనం ఉంటుందని, మూలనక్షత్రం రోజు ఉదయం 3 నుంచి రాత్రి 9 గంటలకు అమ్మవారి దర్శనానికి అనుమతి ఉంటుందని చెప్పారు. (చదవండి: అలర్ట్ : ఈనెల 13 వరకు భారీ వర్షాలు) దేవస్థానంలోని అన్ని ప్రదేశాల్లో శానిటైజేషన్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కరోనా నేపథ్యంలో వచ్చే భక్తులు ఎవరికి వారు వాటర్ తెచ్చుకుంటే మంచిదని ఆయన భక్తులకు సూచించారు. కనకదుర్గ నగరం 6 ప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేశామని, 450 మంది సిబ్బందిని శానిటైజేషన్‌కు ఉపయోగించినట్లు తెలిపారు. మహమ్మారి దృష్ట్యా నదిలో ఎలాంటి స్నానాలకు అనుమతి లేదని, కేశకండనశాల, అన్నదానం ఉండదు పేర్కొన్నారు. ఈసారి దేవస్థానం తరుపున భవాని మాలవిరమన ఏర్పాట్లు ఉండవని, భవానీలు అయిన సరే ఆన్లైన్ టికెట్ ఉంటేనే దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. రోజుకు ఒక లక్ష లడ్డులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, చెప్పుల స్టాండ్‌ను క్లాక్ రూమ్స్ వీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు 93,000 వేల టికెట్స్‌ను ఆన్లైన్లో విడుదల చేస్తే ఇప్పటి వరకూ 65 వేల టికెట్లు బుక్ అయ్యాయని కలెక్టర్ వెల్లడించారు. -
24 నుంచి పీవీ శత జయంతి ఉత్సవాలు
సాక్షి, హైదరాబాద్: మాజీ దివంగత ప్రధాన మంత్రి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సహింరావు శత జయంతి ఉత్సవాలను ఈ నెల 24 నుంచి ప్రారంభించాలని నిర్ణయించినట్లు బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై టీపీసీసీ పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ గీతారెడ్డి, వైస్ చైర్మన్ శ్రీధర్ బాబు, కన్వీనర్ మహేష్ గౌడ్లతో చర్చించినట్లు తెలిపారు. అంతేగాక పీవీ ఉత్సవ కమిటీ సభ్యులు వేణుగోపాల్‌తో కలిసి పీవీ కుటుంబ సభ్యులలైన పీవీ ప్రభాకర్ రావు, పీవీ మనోహర్ రావ్, వాణి దేవిలతో సమావేశమయ్యామని ఆయన చెప్పారు. పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీలో చీఫ్ పట్రాన్‌గా ఉండడానికి పీవీ మనోహర్ రావ్ అంగీకరించారని, 24న జరగబోయే ఆన్లైన్ సమావేశంలో మనోహర్రావ్ పాల్గొంటారని స్పష్టం చేశారు. అదే విధంగా పీవీ ప్రభాకర్ రావ్, వాణిదేవిలు వారి సందేశాలను కూడా పంపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. (చదవండి: మరో సీనియర్ నేతను సస్పెండ్ చేసిన కాంగ్రెస్) జూలై 24వ తేదీన ఉత్సవాలు ప్రారంభించి వరసగా ఏడాది పాటు వివిధ రకాల కార్యక్రమాలు కొనసాగిస్తామని ఉత్తమ్ వెల్లడించారు. పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధం, ఆయన రాజకీయ కార్యక్రమాలు, ఆర్థిక సంస్కరణలు, విదేశీ వ్యవహారాలు అన్ని అంశాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళతామని వివరించారు. ఆన్లైన్లో జరగబోయే ఈ కార్యక్రమంలో పీవీ అత్యంత సన్నిహితులైన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొనే అవకాశం ఉందని చెప్పారు. తర్వాత జరగబోయే కార్యక్రమాలలో మాజీ ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, మాజీ కేంద్ర మంత్రులు జైరాం రమేష్, శశిథరూర్‌లు కూడా పాల్గొంటారని చెప్పారు. పీపీ నర్సింహారావు శత జయంతి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులుగా మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావును నియమించినట్టు ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. -
కరోనా వైరస్: ఇక చైనా మారదు!
బీజింగ్: చైనా ప్రజల ఆహారపు అలవాట్లు మిగతా దేశాలకంటే కాస్త భిన్నంగా ఉంటాయి. వీరి వింత ఆహారపు అలవాట్ల వల్లే మాయదారి కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిందంటూ మిగతా దేశాలు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రతి ఏడాది 10 రోజుల పాటు ఘనంగా జరుపుకునే డాగ్-మీట్(కుక్క మాంసం) ఉత్సవాలను అక్కడి ప్రభుత్వం రద్దు చేసి.. అమ్మకాలపై నిషేధం విధించింది. అంతేగాక కుక్క మాంసాన్ని మానవ ఆహార జాబితా నుంచి తొలగిస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. (ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు) అయినప్పటికీ యులిన్లోని కుక్క మాంసపు దుకాణాలు మాత్రం యధావిధిగా తెరచుకుంటునే ఉన్నాయి. కుక్క మాంసం తినడం ప్రస్తుతం అక్కడ చట్ట విరుద్ధమైనప్పటికీ మాంసపు షాపుల ఎదుట ప్రజలు క్యూ కడుతూనే ఉన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా యులిన్లో డాగ్-మీట్ ఫెస్టివల్‌ను జరుపుకునేందుకు షాపు యాజమానులు సిద్దమయినట్టు సోషల్ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఇందుకోసం వేల సంఖ్యల్లో కుక్కలను చంపి వాటిని షాపుల్లో వేలాడదీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కుక్క మాంసం వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఇంకా చాలా రోజుల సమయం పడుతుందని యులిన్లోని జంతు హక్కుల కార్యకర్త జాంగ్ కియాన్కియాన్ చెప్పుకొచ్చారు. (కరోనాకు ఔషదాన్ని విడుదల చేస్తున్నాం) -
అరకు ఉత్సవాలకు భారీ ఏర్పాట్లు
-
అరకు ఉత్సవ్ పోస్టర్‌ను విడుదల చేసిన అవంతి శ్రీనివాస్
-
నవంబర్ 9,10 తేదీల్లో భీమిలి ఉత్సవ్
-
7 నుంచి లక్ష్మీనరసింహుడి వార్షిక ఉత్సవాలు
యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక ఉత్సవాలు మే 7వ తేదీ నుంచి జరగనున్నాయని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయన్నారు. మే 7న స్వస్తి వచనం, లక్ష కుంకుమార్చన, 8 న లక్ష పుష్పార్చన, 9 న సహస్ర కలశాభిషేకం ఉంటాయని వివరించారు. ఈ మూడు రోజులపాటు నిత్య కల్యాణం, సుదర్శన హోమం రద్దు చేసినట్లు ఈవో తెలిపారు -
రేపటి నుంచి జమలాపురంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతి జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 10 నుంచి 14 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రమణమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మలు తెలిపారు. 10న ఉదయం 8.31 గంటలకు ఉత్సవ మూర్తులను యాగశాల ప్రవేశం చేయించడం, 10.35 గంటలకు కలశ స్థాపన, గణపతి పూజ, రుత్వికరణ రక్షాబంధనం హోమాలు, గిరి ప్రదక్షణ, 11న ఆలయాల్లోని స్వామి మూర్తులకు పవిత్రాలధారణ, 12న పూర్ణాహుతి, పవిత్రాల విసర్జన, అవబృందస్నానం, శాంతి కల్యాణం, 13న శ్రీవారికి, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, అమ్మవార్లను శాకంబరీ దేవి అవతారంలో అలంకరించడం, గిరి ప్రదక్షణ, 14న శ్రీవేంకటేశ్వర స్వామివారికి, ఉత్సవ మూర్తులకు, పుష్పయాగం, భక్తులతో సామూహిక మహా శాంతి హోమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అత్యంత వైభవంగా, ఆలయ ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించనున్న ఈ పవిత్రోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీవారి, అమ్మవార్ల కటాక్షాన్ని పొందాలని ఈఓ రమణమూర్తి కోరారు. -
రేపటి నుంచి జమలాపురంలో పవిత్రోత్సవాలు ప్రారంభం
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతి జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 10 నుంచి 14 వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ రమణమూర్తి, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాస శర్మలు తెలిపారు. 10న ఉదయం 8.31 గంటలకు ఉత్సవ మూర్తులను యాగశాల ప్రవేశం చేయించడం, 10.35 గంటలకు కలశ స్థాపన, గణపతి పూజ, రుత్వికరణ రక్షాబంధనం హోమాలు, గిరి ప్రదక్షణ, 11న ఆలయాల్లోని స్వామి మూర్తులకు పవిత్రాలధారణ, 12న పూర్ణాహుతి, పవిత్రాల విసర్జన, అవబృందస్నానం, శాంతి కల్యాణం, 13న శ్రీవారికి, శ్రీఅలివేలు మంగ, శ్రీపద్మావతి అమ్మవార్లకు పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక అర్చనలు, అమ్మవార్లను శాకంబరీ దేవి అవతారంలో అలంకరించడం, గిరి ప్రదక్షణ, 14న శ్రీవేంకటేశ్వర స్వామివారికి, ఉత్సవ మూర్తులకు, పుష్పయాగం, భక్తులతో సామూహిక మహా శాంతి హోమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అత్యంత వైభవంగా, ఆలయ ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించనున్న ఈ పవిత్రోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీవారి, అమ్మవార్ల కటాక్షాన్ని పొందాలని ఈఓ రమణమూర్తి కోరారు.