బీజింగ్: చైనా ప్రజల ఆహారపు అలవాట్లు మిగతా దేశాలకంటే కాస్త భిన్నంగా ఉంటాయి. వీరి వింత ఆహారపు అలవాట్ల వల్లే మాయదారి కరోనా మహమ్మారి పుట్టుకొచ్చిందంటూ మిగతా దేశాలు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనా ప్రతి ఏడాది 10 రోజుల పాటు ఘనంగా జరుపుకునే డాగ్-మీట్(కుక్క మాంసం) ఉత్సవాలను అక్కడి ప్రభుత్వం రద్దు చేసి.. అమ్మకాలపై నిషేధం విధించింది. అంతేగాక కుక్క మాంసాన్ని మానవ ఆహార జాబితా నుంచి తొలగిస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. (ట్రంప్ నిర్ణయంపై సర్వత్రా నిరసనలు)
అయినప్పటికీ యులిన్‌లోని కుక్క మాంసపు దుకాణాలు మాత్రం యధావిధిగా తెరచుకుంటునే ఉన్నాయి. కుక్క మాంసం తినడం ప్రస్తుతం అక్కడ చట్ట విరుద్ధమైనప్పటికీ మాంసపు షాపుల ఎదుట ప్రజలు క్యూ కడుతూనే ఉన్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా యులిన్‌లో డాగ్-మీట్ ఫెస్టివల్‌ను జరుపుకునేందుకు షాపు యాజమానులు సిద్దమయినట్టు సోషల్ మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఇందుకోసం వేల సంఖ్యల్లో కుక్కలను చంపి వాటిని షాపుల్లో వేలాడదీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కుక్క మాంసం వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు ఇంకా చాలా రోజుల సమయం పడుతుందని యులిన్‌లోని జంతు హక్కుల కార్యకర్త జాంగ్ కియాన్కియాన్ చెప్పుకొచ్చారు. (కరోనాకు ఔషదాన్ని విడుదల చేస్తున్నాం)
Comments
Please login to add a commentAdd a comment