దుస్తులు ఆరేసుకునే క్రమంలో ఓ విద్యార్థి షాక్‌కు గురై చనిపోయాడు.
దుస్తులు ఆరేసుకునే క్రమంలో ఓ విద్యార్థి షాక్‌కు గురై చనిపోయాడు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక
రామచంద్రాపురంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఫస్టియర్ చదువుకుంటున్న యశ్వంత్‌రెడ్డి(17) గురువారం రాత్రి హాస్టల్ ఉతికిన తన దుస్తులను తీగపై ఆరేసుకుంటుండగా షార్ట్‌సర్క్యూట్‌తో షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరిన అతడిని వెంటనే తోటి వారు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. యశ్వంత్‌రెడ్డిది గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం.