మధ్యాహ్న భోజనం తిని అస్వస్థత | Students Illness With Food Poison in Karnataka | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజనం తిని అస్వస్థత

Jan 29 2019 12:04 PM | Updated on Jan 29 2019 12:04 PM

Students Illness With Food Poison in Karnataka - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

కర్ణాటక, కృష్ణరాజపురం : మధ్యాహ్న భోజనం తిని ఎనిమిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన బెంగళూరు తూర్పు తాలూకా నింబెకాయినపుర గ్రామం ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. సోమవారం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్నం భోజనం తిన్న కొద్ది సేపటికే ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను హుటాహుటిన హొసకోటె పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఎనిమిది మందితో పాటు మిగిలిన 14 మంది విద్యార్థులను కూడా పాఠశాల ఉపాధ్యాయులు ఆసుపత్రిలో చేర్పించారు. 14 మంది విద్యార్థులకు ప్రాథమిక వైద్యసేవలు అందించి డిశ్చార్జ్‌ చేసిన వైద్యులు ఎనిమిది మంది విద్యార్థులకు చికిత్స కొనసాగించారు. విషయం తెలుసుకున్న జిపం సభ్యుడు కెంపరాజు,మండూరు గ్రాపం అధ్యక్షుడు వేణు ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement