‘తమిళనాడు అసెంబ్లీని రద్దు చేయాలి’ | Tamil Nadu Assembly must be dissolved: Karti Chidambaram | Sakshi
Sakshi News home page

‘తమిళనాడు అసెంబ్లీని రద్దు చేయాలి’

Published Wed, Feb 8 2017 7:53 PM | Last Updated on Thu, May 24 2018 12:05 PM

‘తమిళనాడు అసెంబ్లీని రద్దు చేయాలి’ - Sakshi

‘తమిళనాడు అసెంబ్లీని రద్దు చేయాలి’

చెన్నై: అధికార అన్నాడీఎంకేలో సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీని రద్దు చేసి, తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్‌ నాయకుడు కార్తి చిదంబరం డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో జయలలితకు తమిళనాడు ప్రజలు తీర్పు ఇచ్చారని ఆయన తెలిపారు. ఆమె చనిపోవడంతో  రాష్ట్రం పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు శాసనసభను వెంటనే రద్దు చేయాలని కోరారు.

గతంతో పోలిస్తే తమిళనాడులో రాజకీయ పరిస్థితులు పూర్తి భిన్నంగా మారాయని కార్తి తండ్రి, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం అంతకుముందు వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టే అర్హత శశికళకు లేదని పరోక్షంగా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement