మహబూబ్‌నగర్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే సీఎం నూతన క్యాంపు కార్యాలయ భవనం ప్రారంభాన్ని అడ్డుకుంటామని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చిలుక మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. ఆమనగల్లు పట్టణంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ విద్యార్థి వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని ఆరోపించారు. ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న హైదరాబాద్‌లో సీఎం క్యాంపు కార్యాలయ ప్రారంభాన్ని విద్యార్థులతో కలిసి అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు.