నాలో లోపమేంటో చెప్పండి | tell me the defect in me says Taapsee Pannu | Sakshi
Sakshi News home page

నాలో లోపమేంటో చెప్పండి

Published Sun, May 24 2015 2:58 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

నాలో లోపమేంటో చెప్పండి - Sakshi

నాలో లోపమేంటో చెప్పండి

నాలో లోపమేంటో చెప్పండి ప్లీజ్ అంటున్నారు నటి తాప్సీ. ఆ మాటల్ని చూస్తుంటే ఈ ఉత్తరాది బ్యూటీ చాలా ఆవేదన చెందుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాప్సీ నిజంగా అందగత్తే. అభినయంలోనూ తక్కువేమీకాదు. అయినా సరైన మార్కెట్ ఆమె అందుకోలేక పోయారు. తాప్సీ బహుబాషా నటి కూడా. ముఖ్యంగా దక్షిణాదిలో ముఖ్యంగా తమిళం, తెలుగుభాషల్లో యువనటులందరి సరసనా నటించారు. అయినా అంతగా పాపులర్  కాలేకపోయారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ తాను పాత్రకు తగిన న్యాయం చెయ్యలేననే ప్రచారం జరుగుతోందన్నారు.
 
 ఇది తనను వేదనకు గురి చేసే అంశం అన్నారు. ఇలాంటి వదంతుల కారణంగానే కాంచన-2 చిత్రంలో దెయ్యం పాత్రను అంగీకరించి నటిగా తానేమిటో నిరూపించుకున్నానన్నారు. ప్రస్తుతం మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయని పేర్కొన్నారు. హిందీలో రెండు, తమిళంలో రెండు చిత్రాలంటూ బిజీగానే ఉన్నానన్నారు. కానీ తెలుగులో ఒక్క అవకాశం కూడా లేక పోవడం బాధగా ఉందన్నారు. తనలో కొరతేమిటో ఇప్పటికీ తనకు తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా నాలో లోపమేంటో  చెప్పండి ప్లీజ్. అలాంటిదేమయినా ఉందని తెలిస్తే సరిదిద్దుకుంటానని ఈ ఉత్తరాది భామ అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement