ఘనంగా తెలుగువారి వీడ్కోలు | telugu peoples celebrated ganesh immersion grandly | Sakshi
Sakshi News home page

ఘనంగా తెలుగువారి వీడ్కోలు

Published Thu, Sep 19 2013 11:14 PM | Last Updated on Fri, Aug 3 2018 2:57 PM

telugu peoples celebrated ganesh immersion grandly

రాష్ర్టవ్యాప్తంగా ఆయా నగరాలు, పట్టణాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు పదిరోజుల పాటు గణేశ్ ఉత్సవాలను జరుపుకున్న అనంతరం బుధవారం నిమజ్జనాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగు సంస్కతి సంప్రదాయం ఉట్టిపడేలా అలంకరించిన వాహనాలపై గణనాథులను ఆటపాటలతో,  చిందులతో తోడ్కొని పోయి సమీప సముద్ర తీరాల్లో, నదీ జలాల్లో నిమజ్జనం చేశారు. ఆయా కార్యక్రమాల్లో తెలుగు ప్రజలతో పాటు స్థానికులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. పలు తెలుగు గణేశ్ మండళ్లు సేవా కార్యక్రమాలు, అన్నదానాలు నిర్వహించారు.
 
 వర్సోవా, న్యూస్‌లైన్: తూర్పు చెంబూర్‌లోని మాహుల్‌గావ్ ప్రాంతంలో ‘ఆంధ్ర గణేశ్ మిత్ర మండలి’ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం గణేశ్ నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్థానిక సముద్ర తీరం వద్ద ఆఖరి హారతి అందించి వినాయకుడికి వీడ్కోలు పలికారు. ఉత్సవాల్లో భాగంగా భక్తులు గణపతికి సమర్పించిన లడ్డూను వేలం వేయగా సంపత్ శ్రీనివాసులు రూ.15,500 లకు దక్కించుకున్నారు. శ్రీ సత్యనారాయణ మహా పూజ , శ్రీ వేంకటేశ్వర స్వామి, గణపతి పూజ, ఓం పూజలు జరిగాయని, భక్తులకు అన్నదానం చేశామని నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల్లో అతిథులుగా విజయా బ్యాంక్ మేనేజర్ ఎన్.అంజయ్య, ఎం.కొండారెడ్డి, ఎస్.కాసిరెడ్డి, ఎం.తిరుపతి రెడ్డి, జి.వెంకటయ్య, నాగయ్య, వెంకటేశ్వర్లు, జి.వెంకటరెడ్డి, పిచ్చయ్య, గురువయ్య, రాజుల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన వేలాది మంది నివసిస్తున్న మాహుల్‌గావ్‌లో గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా గణేశోత్సవాలను నిర్వహిస్తున్నామని మండలి సభ్యులు తెలిపారు.
 
 సూరత్‌లో..
 సాక్షి, ముంబై: సూరత్‌లో గణనాథుల నిమజ్జన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువత సంగీత నత్యాలు చేస్తూ విఘ్నేశ్వరుడిని సాగనంపారు. లడ్డూ వేలం, సత్యనారాయణ స్వామి పూజలతో మండపాలన్నీ కోలాహాలంగా కనిపించాయి. లింబాయత్‌లోని గణేశ్ మండపాలను పార్లమెంట్ సభ్యుడు ఎం.పీ.ఆర్.పాటిల్, స్థానిక తెలుగు కార్పొరేటర్లు రాపోలు లక్ష్మి, పి.ఎస్.శర్మలు దర్శించుకున్నారు. ముఖ్యంగా పట్టణంలో తెలుగు వారు అధికంగా నివాసముంటున్న లింబాయత్ పోలీస్‌స్టేషన్ పరిధిలో 681 సార్వజనిక్ గణేశ్ మండళ్లు గణనాథులను నిమజ్జనం గావించాయి. లింబాయత్‌లోని మార్కండేయ యువకమిటీ గణేశ్ ప్రసాదం (లడ్డూ)ను వేలంలో పవిత్ర సారీ హోస్ అధిపతి గంగుల వెంకటేష్ రూ.41 వేలకు దక్కించుకున్నారని పద్మశాలీ యువ కమిటీ అధ్యక్షుడు యెన్నం వెంకన్న తెలిపారు.
 
 పశ్చిమ ఠాణేలో..
 సాక్షి, ముంబై: పశ్చిమ ఠాణేలోని సుభాష్ నగర్‌లో ‘శ్రీ ఆంధ్ర గణేశ్ మిత్ర మండలి వారి ఆధ్వర్యంలో బుధవారం నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ఎక్కువగా నివసించే తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగు ప్రజలు 47 ఏళ్లుగా ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు. విఘ్నేశ్వరుడికి సమర్పించిన లడ్డూను వేలంపాటలో బాబ్జీ అనే భక్తుడు రూ.5,600 కైవసం చేసుకున్నాడు. చివరిగా స్థానిక నదిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక మేయర్ హరిచంద్ర పాటిల్, నవీ ముంబై బీజేపీ అధ్యక్షుడు సీవీ రెడ్డి, మండలి సభ్యులు భాస్కర్‌రావు, కె.శ్రీనివాస్‌రావు, జి.సాయిబ్‌రావు, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
 
 భివండీలో..
 భివండీ, న్యూస్‌లైన్: భివండీలో 10 రోజులు పూజలందుకున్న గణేశుడి విగ్రహాలను బుధవారం సాయంత్రం ఘనంగా నిమజ్జనం చేశారు. నిమజ్జన ఘాట్ల వద్ద చివరి హారతి అందించి వినాయకుడికి వీడ్కోలు పలికారు. పట్టణవ్యాప్తంగా ఇళ్లల్లో ప్రతిష్ఠించిన 6,267 విగ్రహాలు, 158 సార్వజనిక గణపతులు వరాలదేవి, పేనాగావ్, కామత్‌ఘర్, కరివలి, తిలక్, నదినాక తదితర ఘాట్ల వద్ద నిమజ్జనమయ్యాయని కార్పొరేషన్ అధికారులు తెలిపారు. జీవన్ రక్షా తెలుగు బందం ప్రతి సంవత్సరం మాదిరిగానే వరాలదేవి ఘాట్ వద్ద ఉదయం నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు సేవలందించారు. ముఖ్యంగా ధామన్‌కర్ నాకా మిత్ర మండలి, స్వ. నానా పండిత్ మిత్ర మండలి గణపతులు రాత్రి ఎనిమిది గంటలకే నిమజ్జనం గావించారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణ పోలీసులు గట్టి  బందోబస్తు నిర్వహించారు.
 
 వర్లీలో..
 సాక్షి, ముంబై: వర్లీలోని పద్మశాలి సమాజ సుధారక మండలి సాంస్కతిక సమితి ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించినట్లు సాంస్కతిక సమితి పదాధికారి అల్లె శంకరయ్య చెప్పారు. బుధవారం సాయంత్రం సమాజ హాలు నుంచి గణపతి విగ్రహాన్ని భారీ ఊరేగింపు మధ్య లోటస్ సముద్రతీర ప్రాంతంలో నిమజ్జనం చేసినట్లు మండలి అధ్యక్షుడు వాసాల శ్రీహరి చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే సతీమణి సంగీత అహిర్, బీజేపీ ముంబై నాయకులు సునీల్ రాణే తదితరులను పూలమాలతో సత్కరించారు. నిమజ్జన ఉత్సవాల్లో ఆ సంస్థ పదాధికారులు కస్తూరి హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement