సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత | tension at sircilla area hospital | Sakshi
Sakshi News home page

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రి ఎదుట ఉద్రిక్తత

Published Wed, Feb 8 2017 12:12 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM

tension at sircilla area hospital

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతారణం నెలకొంది. వైద్యం కోసం వచ్చిన గర్భిణికి సరైన సమయంలో వైద్యం అందించక పోవడంతో.. కడుపులో ఉన్న బిడ్డ మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన ఆమె బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పట్టణానికి చెందిన బోగ మమత పురిటి నొప్పులతో బాధపడుతూ మంగళవారం రాత్రి సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో చేరింది.
 
అక్కడ సమయానికి వైద్యం చేయకపోవడంతో పాటు.. పరిస్థితి విషమించిన తర్వాత వేరే ఆస్పత్రికి తీసుకెళ్లండని సూచించారు. దీంతో బుధవారం ఉదయం పట్టణంలోని మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లగా కడుపులో ఉన్న బిడ్డ మృతి చెందిందని వైద్యలు తెలిపారు. దీంతో  ఆమె బంధువులు ఏరియా ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement