నల్లగొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.
నల్లగొండ: నల్లగొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిల మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది. జిల్లాలో ప్రోటోకాల్ ఎక్కడ పాటించడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి ఆరోపించారు. అధికారులు సమాధానం చెప్పాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మంత్రి జగదీష్ రెడ్డి స్పందిస్తూ దానికి మీరే కారణం అంటూ ఎదురు దాడికి దిగారు. రౌడీ రాజకీయాలు చేస్తూ తమపై నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని మంత్రి స్పష్టం చేశారు. దీంతో ఇద్దరి మధ్య వివాదం మరింత ముదిరింది. ఒకానొక దశలో ఏం జరుగుతుందో... ఎవరేమి మాట్లాడుతున్నారో అర్ధం కాని పరిస్థితి నెలకొంది.
మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డిలు ఒకరి వైపు ఒకరు చేతులు చూపుకుంటు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ పంచాయితీ పెట్టుకున్నారు. దీంతో సభలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సర్దిచెప్పే యత్నం చేశారు. ఇరుపార్టీల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు కూడా వాగ్వాదానికి దిగారు. దీంతో బాహాబాహికి దిగే పరిస్థితి కనిపించింది. జెడ్సీ చైర్మన్ బాలునాయక్, ఇతర ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు. అనంతరం సభలో మంచినీటి సమస్యలపై చర్చించారు.
Nalgonda district , zp General Meeting, mla komatireddy, minister jagadish reddy, సర్వసభ్య సమావేశం, ఎమ్మెల్యే కోమటిరెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి,