ఘనంగా జన్మాష్టమి
Published Thu, Aug 29 2013 12:17 AM | Last Updated on Fri, Sep 1 2017 10:12 PM
న్యూఢిల్లీ: నగరవాసులు బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకున్నారు. ఉదయం నుంచే నగరంలోని కృష్ణ మందిరాలు భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా భక్తులు ఆయా ఆలయాల్లో పూజలు నిర్వహించారు. బిర్లా మందిర్, ఇస్కాన్ తదితర ఆలయాల వద్ద నుంచి నగరంలోని అనేక ప్రాంతాలమీదుగా రథయాత్ర నిర్వహించారు. శ్రీకృష్ణ నామస్మరణతో నగరమంతా హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా కొంద రు భక్తులు భగవద్గీతను పఠించారు. మరి కొంతమంది భక్తులు మంగళవారం రాత్రంతా ఉపవాసముండి, ఉదయాన్నే ఆయా ఆలయాల్లో పూజ లు చేశారు.
పండుగ నేపథ్యంలో నిర్వాహకులు ఆయా ఆలయాలను సుందరంగా అలంకరించారు. రంగురంగుల విద్యుద్దీపాలు ఏర్పాటు చేయడంతో ఆలయాలన్నీ శోభాయమానంగా కనిపించాయి. హరేరామ హరేకృష్ణా.. గోవిందా ఆలారే తదితర భక్తిగీతాలను అలపించారు. కొంతమంది ఆనంద పరవశంతో నృత్యాలు చేశారు. నెహ్రూ ప్లేస్‌కు సమీపంలోని ఇస్కాన్ మందిరం, మధ్య ఢిల్లీలోని బిర్లా ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో దహిహండి నిర్వహించారు. కొన్ని ప్రాంతాల్లో రథాల ఊరేగింపు జరిగింది.
రాష్ట్రపతి శుభాకాంక్షలు
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నగరవాసులకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజ లంతా సన్మార్గంలో నడవాలంటూ ఆయన ఆకాం క్షించారు.
తీహార్ కారాగారంలో
తీహార్ కారాగారంలోని ఖైదీలు బుధవారం శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా భక్తిగీతాలాపనతోపాటు నృత్యకార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయాన్ని జైలు అధికార ప్రతినిధి సునీల్ గుప్తా వెల్లడించారు. హరేరామ, హరేకృష్ణ అంటూ భక్తితో నినదించారు. ఈ కార్యక్రమంలో ఖైదీల పిల్లలు కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత దహిహండి కూడా నిర్వహించారు.
Advertisement
Advertisement