
బ్రెయిలీ సాక్షిగా ఒక్కటైన అంధ జంట
అంధులు ఎవరికీ తీసిపోరనే విధంగా అంధ జంట తమ వివాహ ఆహ్వాన పత్రికను అంధులు సైతం చదవగలిగే విధంగా బ్రెయిలీలో ముద్రించి, వివాహం చేసుకుని ఒక్కటయ్యారు.
కేకేనగర్(చెన్నై): అంధులు ఎవరికీ తీసిపోరనే విధంగా అంధ జంట తమ వివాహ ఆహ్వాన పత్రికను అంధులు సైతం చదవగలిగే విధంగా బ్రెయిలీలో ముద్రించి, వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. వివరాలు.. మురుగన్–ప్రేమ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఈ ముగ్గురు అంధులే. అయినప్పటికీ మానస్థైర్యం కోల్పోకుండా ఆ దంపతులు ముగ్గురు పిల్లలను బాగా చదివించి మంచి స్థాయికి తీసుకొచ్చారు. వారిలో పెద్ద కుమార్తె ముత్తుసెల్వి. లా చదివిన ఈమె ప్రస్తుతం చెన్నై టీనగర్‌లోని అలహాబాద్ బ్యాంకు మండల కార్యాలయంలో మేనేజర్‌గా పనిచేస్తున్నారు.
అంతేకాకుండా అఖిల భారత అంధుల సమాఖ్య కార్యదర్శి. అంధుల సమస్యలపై గళం విప్పుతున్నారు. ఇంకా సాంస్కృతిక పుస్తకాలు, నవలలు, చిన్న కథల పుస్తకాలు వంటి వాటిని బ్రెయిలీలోకి అనువదించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంధుల పాఠశాలలకు పంపుతున్నారు. అంధులు కంప్యూటర్‌లో తమ సామర్థ్యాన్ని ప్రదర్శించడం కోసం తన స్వచ్ఛంద సంస్థ ద్వారా శిక్షణ కూడా అందిస్తున్నారు. ఇలాఉండగా ముత్తుసెల్వి – పాండియరాజన్‌ల వివాహం బుధవారం ఉదయం జరిగింది.
ఇందులో మరో విశేషం ఏమిటంటే వీరి వివాహ ఆహ్వాన పత్రిక అంధులు సైతం చదివే విధంగా బ్రెయిలీ లిపిని కలిపి టూ ఇన్ వన్‌గా ముద్రించారు. పాండి యరాజన్ చెన్నై అంబత్తూర్‌లో ఇండియ న్ బ్యాంకులో పనిచేస్తున్నారు. ‘అందక్కవిపేరవై’ అనే సాంస్కృతిక సంస్థ సభ్యు డు. అంధుల సంక్షేమం కోసం పలు విధాలుగా సేవలు అందిస్తుంటారు. ఈ సందర్భంగా ముత్తుసెల్వి మాట్లాడు తూ.. అంధురాలైన ఒక యువతికి ఆమె మనస్సును అర్థం చేసుకునే వ్యక్తితో వి వాహం జరగడం గొప్ప విషయం అన్నా రు. అంధులు ఎవరికీ తీసిపోరనే విధంగా తమ వివాహ ఆహ్వాన పత్రికను బ్రెయిలీలో ముద్రించినట్టు తెలిపారు.