హడల్
Published Sun, Jan 19 2014 2:14 AM | Last Updated on Sat, Aug 11 2018 6:07 PM
రాష్ర్టంలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోతుండడంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. ఒకే రోజు ఐదు సంఘటనల్లో కోటి రూపాయల విలువైన వస్తువులు చోరీ అయ్యాయి. బంగారం ధర పెరగడం ఒక కారణమైతే, ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ కాకపోవడం మరో కారణం. దీంతో దొంగలు చేతికి పగ్గాలు వేయడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి: రాష్ట్రం దొంగలమయమైపోయింది. ఇళ్లలో చోరీలు, చైన్ స్నాచింగ్‌లు వంటి వరుస సంఘటనలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రెండేళ్లుగా బంగారం ధర విపరీతంగా పెరిగిపోవడంతో నగల చోరీలు పెరిగి పోతున్నారుు. విదేశాల నుంచి బంగారు బిస్కెట్ల స్మగ్లింగ్ కూడా పెరిగిపోయింది. చెన్నై విమానాశ్రయం లో సగటున రోజుకు ఒకరు చొప్పున బంగారం స్మగ్లిం గ్ చేస్తూ పట్టుబడుతున్నారు. స్మగ్లింగ్ చేయలేని దొంగ లు ఆభరణాల చోరీపై దృష్టి సారిస్తున్నారు. ఇళ్లకు తాళాలు వేయాలంటే భయం, బయటికి వెళ్లాంటేనే వణుకు, గుట్టుగా ఇంటిలోనే కాలం గడుపుదామన్నా రక్షణ లేని పరిస్థితిని ప్రజలు ఎదుర్కొంటున్నారు.
ఒక్కరోజే..
చెన్నై శివారులోని ఈక్కాడుతాంగల్ డిఫెన్స్ ఆఫీసర్ కాలనీకి చెందిన పారిశ్రామికవేత్త జయప్రకాష్ కుటుం బ సభ్యులతో కలిసి ఈనెల 16వ తేదీన తిరుమలకు వెళ్లారు. 17వ తేదీ రాత్రికి ఇంటికి చేరుకోగా దొంగలు పడ్డట్లు గుర్తించారు. ఇంటి వెనుక తలుపుతెరిచి లోనికి ప్రవేశించిన దొంగలు బీరువా లాకర్‌ను పగులగొట్టి రూ.3.50 లక్షల నగదుతోపాటూ మొత్తం 50 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలను దోచుకెళ్లారు. ఆ రంబాకం పూందమల్లి హైరోడ్డుకు చెందిన ఏకాంబరం ఈ నెల 17వ తేదీ రాత్రి తన భార్యతో ఆలయానికి వెళ్లి వచ్చాడు. భార్య ఇంటి తలుపు తెరుస్తుండగా మోటార్ సైకిల్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని 3 తులాల బంగారు చైను లాక్కెళ్లారు. వలసరవాక్కంకు చెందిన సురేష్ భార్య కవిత ఈనెల 17వ తేదీ రాత్రి గాలికోసం కిటికీ తలుపులు తెరిచి పక్కనే నిద్రపోయింది. కిటికీకి అమర్చిన దోమతెరను కట్ చేసి ఆమె మెడలోని 12 పౌన్ల బంగారు నగను దొంగిలించాడు. పూందమల్లి కుమరన్ చావడికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు నిర్మలా దేవీ యథావిధిగా తన విధులను ముగించుకుని ఇంటికి నడిచివెళుతుండగా
మోటార్‌సైకిల్‌పై హెల్మెట్ ధరించి వచ్చిన వ్యక్తి ఆమె మెడలోని 7 పౌన్ల చైనును అపహరించుకు వెళ్లాడు. మొత్తం కోటి రూపాయలకు పైగా నగలు చోరీ అయ్యూరుు. అరుుతే ఇవన్నీ ఒకే రోజు జరగడం గమనార్హం.
కొడంగయ్యూర్‌లో వరుస చోరీలు
నగరంలోని మరో శివారు ప్రాంతమైన కొడంగయ్యూర్ సైతం దొంగల క్షేత్రంగా మారిపోయింది. కృష్ణమూర్తి నగర్‌కు చెందిన వరలక్ష్మి సమీపంలోని తన కుమార్తె ఇంటికి వెళ్లి నడిచి వస్తుండగా బైక్‌పై వచ్చిన ఆసామి ఆమె మెడలోని 3 పౌన్ల చైనుపై చేయివేశాడు. ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో చేతికి చిక్కిన సగం చైనుతో ఉడాయించాడు. కాటంగలూర్ గాంధీనగర్‌కు చెందిన రహ్మదా ఇదే విధంగా 5 పౌన్ల చైనును కోల్పోయింది. ముత్తమిళ్ నగర్‌కు చెందిన ఉషారాణి అనే గృహిణి ఇంటి ముందు నిలబడి తన బిడ్డకు అన్నం తినిపిస్తుండగా 5 పౌన్లు చైనును దొంగలు లాక్కెళ్లిపోయారు. వివేకానందనగర్‌కు చెందిన తంగవేలు అనేవ్యక్తిపై కట్టెతో దాడిచేసి 7 పౌన్ల చైనును అపహరించారు.
నకిలీ డాక్టర్... నగలు చోరీ
ఒక నకిలీ డాక్టర్ రాష్ట్రమంతా తిరుగుతూ ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రవేశించి రోగుల నగలు కాజేస్తున్నాడు. తూత్తుకూడికి చెందిన నాచ్చియమ్మాళ్ (78), జయశేఖరి (83) స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చూసేం దుకు హీరోలా ఉండే ఈ నకిలీ డాక్టర్ ఈనెల 16వ తేదీన వీరిద్దరికీ మాయమాటలు చెప్పి వారిమెడలోని నగలు ఎత్తుకెళ్లాడు. ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో అతని ఫోటో స్పష్టంగా నమోదైంది. ఈ ఫొటోను రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపగా, కోయంబత్తూరు, తిరుచ్చిరాపల్లీ, మధురైతోపాటూ అనేక నగరాల్లో నకిలీ డాక్టర్ చేతివాటాన్ని ప్రదర్శించినట్లు గుర్తించారు. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో సైతం ఇదే తరహా చోరీ జరిగిన ట్లు కేసు నమోదుకాగా ఇది కూడా ఆ నకిలీ డాక్టర్ పనేనని అనుమానిస్తున్నారు. ఫొటో సాయంతో అతని కోసం పోలీసులు రాష్ట్రమంతా గాలిస్తున్నారు. రాష్ట్రంలో దొంగలు విచ్చలవిడిగా సంచరిస్తుండగా ప్రజలు హడలెత్తిపోతున్నారు
Advertisement