
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..
న్యూఢిల్లీ : ఆప్ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆ పార్టీ సహవ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. పార్టీలో ముందు నుంచి వ్యూహం ప్రకారమే గందరగోళం సృష్టించారని శనివారం ఆయన అన్నారు. ఆప్ వ్యవస్థాపక సభ్యులైన ప్రశాంత్ భూషణ్, మోగేంద్ర యాదవ్ లను ఆ పార్టీ జాతీయ కార్యవర్గం నుంచి తప్పించింది. వీరితో పాటు ఆజీత్ ఝా, శాంతి భూషణ్లను ఆప్ బహిష్కరించింది. శనివారం జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ లకు అనుకూలంగా 23 ఓట్లురాగా, వ్యతిరేకంగా 200లకు పైగా ఓట్లు వచ్చాయని సమాచారం.