టిప్పు స్వాతంత్ర్య యోధుడు కాడు: హైకోర్టు
టిప్పు స్వాతంత్ర్య యోధుడు కాడు: హైకోర్టు
Published Thu, Nov 3 2016 12:30 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
-టిప్పు జయంతిని ఎందుకు నిర్వహించాలి?
-ప్రభుత్వానికి హైకోర్టు సూటిప్రశ్న
బెంగళూరు: ’టిప్పు సుల్తాన్ జయంతి నిర్వహణతో ప్రభుత్వం పలు ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోంది. అందువల్ల ఈ జయంతిని ఎందుకు నిర్వహించాలి’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.కే ముఖర్జీ ప్రభుత్వాన్ని బుధవారం సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం టిప్పుసుల్తాన్ జయంతిని నిర్వహిచడం సరికాదని పేర్కొంటూ నగరానికి చెందిన సామాజికవేత్త మంజునాథ్ రాష్ట్ర హైకోర్టులో ప్రజాహిత వాజ్యాన్ని వేశారు. కేసు విచారణలో భాగంగా ఎస్.కే ముఖర్జీ...’టిప్పు సుల్తాన్ ఓ రాజ్యానికి రాజు మాత్రమే. నిజాంలపై ఆంగ్లేయులు దండెత్తినప్పుడు తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే నిజాంలకు మద్దతు ఇచ్చారు. అందువల్ల టిప్పు సుల్తాన్ స్వతంత్య్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తిగా ఎలా చెబుతారు?. అసలు టిప్పు సుల్తాన్ జయంతి ఉద్దేశం ఏమిటీ?’ అని ప్రశ్నిస్తూ విచారణను నేటి (గురువారం)కి వాయిదా వేశారు.
Advertisement