కేంద్రానికి హైకోర్టు ఉత్తర్వులు
టీనగర్: హింస, అసభ్య సన్నివేశాలను అరికట్టేందుకు టీవి ప్రసారాలను సెన్సార్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి హైకోర్టు న్యాయవాది అలెక్స్ పెన్సికార్ సహా నలుగురు దాఖలు చేసిన ప్రజాహిత పిటిషన్‌లో ప్రైవేటు చానళ్లు ప్రసారం చేస్తున్న టీవీ కార్యక్రమాల్లో హింస, అశ్లీలం అధికంగా చోటుచేసుకుంటోందని తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు సమాజాన్ని కలుషితం చేస్తాయన్న భీతి కలుగుతోందని, అందువల్ల సినిమాలకు సెన్సార్ ఉన్న విధంగా టీవీ కార్యక్రమాలకు కూడా సెన్సార్ తప్పనిసరి చేయాలని పిటిషన్‌లో కోరారు. పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి ఎంఎం సుందరేష్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఈ విధంగా ఉత్తర్వులిచ్చింది. ఈ కేసులో కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ టీవీ కార్యక్రమాలను సెన్సార్ చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఉత్తర్వు లిచ్చారు.
టీవీ ప్రసారాలకు సెన్సార్
Published Thu, Jan 29 2015 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM
Advertisement
Advertisement