
లభ్యమైన బాంబులు
ధర్మపురి సమీపంలో రోడ్డుపై బాంబులు లభ్యమయ్యా యి. సోమవారం ఓ బస్సు డ్రైవర్ వాటిని గుర్తించడంతో ప్రమాదం తప్పింది. ధర్మపురి నుంచి కడత్తూరుకు వెళ్తున్న బస్సు మణియంబాడి వద్ద ఆగింది. రోడ్డు పక్కనే పడి ఉన్న సంచిని డ్రైవర్ గుర్తించాడు. అందు లో వింత ఆకారంలో పార్శిల్ ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు.
పోలీసులు వాటిని పరిశీలించి బాంబులని నిర్ధారించా రు. ఒక్కొక్కటి రెండు కిలోల బరువు ఉన్నట్టు తేల్చారు. ఏడు డిటోనేటర్లతో వాటిని రూపొందించినట్లు గుర్తించిన అనంతరం నిర్వీర్యం చేశా రు. అవి ఇక్కడికి ఎలా వచ్చాయన్న దానిపై విచారణ జరుపుతున్నారు.