రొమాంటిక్‌గా ‘ఇదయం మురళి’ | Udhayanidhi in New York for 'Idhayam Murali | Sakshi
Sakshi News home page

రొమాంటిక్‌గా ‘ఇదయం మురళి’

Published Sun, Mar 22 2015 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 11:11 PM

రొమాంటిక్‌గా ‘ఇదయం మురళి’

రొమాంటిక్‌గా ‘ఇదయం మురళి’

 ఇదయం మురళి చిత్రం హ్యాపీగా షూటింగ్ సాగుతోందని ఆ చిత్ర హీరోయిన్ హన్సిక అంటున్నారు. అంతేకాదు. ఒరు కల్ ఒరు కన్నాడి చిత్ర సక్సస్ ఈ తాజా చిత్రంతో రిపీట్ అవుతుందనే నమ్మకాన్ని ఈ చుట్టబుగ్గల చిన్నది వ్యక్తం చేస్తోంది. కోలీవుడ్‌లో మంచి రైజింగ్‌లో ఉన్న హీరోయిన్ హన్సిక. అరణ్మణై, ఆంబళ చిత్ర విజయాలతో యమ ఖుషీగా ఉన్న హన్సిక ఈ మధ్య తన ఫొటోలతో మార్ఫింగ్ చేసిన బాత్‌రూమ్ సన్నివేశాలు ఇంటర్‌నెట్‌లో హల్ చల్ చేయడంతో కాస్త అప్‌సెట్ అయ్యారు.  ఇదయం మురళి చిత్ర షూటింగ్ ఆ బాధను తొలగించి సంతోషాన్ని నింపుతోందని హన్సిక అన్నారు.
 
 ఉదయనిధి స్టాలిన్ హీరోగా పరిచయం అయిన ఒరు కల్ ఒరు కన్నాడి చిత్రంలో ఆయనతో జోడి కట్టి సక్సస్‌ను అందుకున్న భామ తాజాగా మరోసారి ఆయనతో నటిస్తున్న చిత్రం ఇదయం మురళి. ఈ చిత్రానికి అహ్మద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఇంతకుముందు జీవా, త్రిష జంటగా ఎండ్రెండ్రుం పున్నగై చిత్రం తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారన్నది గమనార్హం. ఇదయం మురళి చిత్రం రొమాంటిక్ చిత్రం అని అన్నారు. ఈ బ్యూటీ నటించిన వాలు, రోమియో జూలియట్ చిత్రాలు త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం హన్సిక విజయ్ సరసన పులి చిత్రంలో నటిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement