
ఘనంగా విజయకాంత్ జన్మదినం
హొసూరు : తమిళ చలనచిత్ర నటుడు, డీఎండీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు విజయకాంత్ 62వ జన్మదిన వేడుకలు క్రిష్ణగిరి జిల్లాలో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో పూజలు నిర్వహించి అన్నదానం చేశారు. ఆస్పత్రుల్లో రోగులకు పాలు, బ్రెడ్, పండ్లు అందజేశారు.
డెంకణీకోట తాలూకా కెలమంగలంలో డీఎండీకే పట్టణ కార్యదర్శి డీసిఎం మురుగేషన్ అధ్యక్షతన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. బస్టాండులో పార్టీ జెండాను ఎగురవేసి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు గణేష్, వీసీ మురుగేష్, రంగనాథన్, ఆర్‌సీ పుట్టరాజ్, మాదేవ్, ఎస్ రుద్రేష్, మాణిఖ్యం తదితరులు పాల్గొన్నారు.