ఓటర్లు 5.37 కోట్లు | voters list 5.37 crores | Sakshi
Sakshi News home page

ఓటర్లు 5.37 కోట్లు

Published Sat, Jan 11 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 AM

voters list 5.37 crores


 
     ఓటర్ల తుది జాబితా విడుదల
     కొత్త ఓటర్లు 23.49 లక్షల మంది
     రాష్ట్ర ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ వెల్లడి
 
 ప్యారిస్, న్యూస్‌లైన్: రాష్ట్రంలో 5.37 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆయన శుక్రవారం చెన్నైలో ఓటర్ల తుది జాబి తాను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 71.24 శాతం మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. వీరిలో 2.69 కోట్ల మంది పురుష ఓటర్లు, 2.68 కోట్ల మంది మహిళా ఓటర్లు,  2,996 మంది హిజ్రా లు ఉన్నారని పేర్కొన్నారు. కొత్తగా 23.49 లక్షల మంది ఓటు హక్కు పొందారని వివరించారు. 4,03,407 మంది ఓటర్లు తమ పేర్లను జాబితా నుంచి తొలగించుకున్నారని వెల్లడించారు. కొత్త ఓటర్లకు గుర్తింపు కార్డులను జనవరి 25వ తేదీ నుంచి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి అందజేస్తామన్నారు.
 
 చెన్నైలో 36 లక్షల మంది ఓటర్లు
 చెన్నై కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్నికల విభాగం కమిషనర్ విక్రమ్ కపూర్ ఓటర్ల జాబితాను విడుదల చేశారు. చెన్నైలో 16 శాసన సభ నియోజకవర్గాల్లో 36,36,199 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 18,13,076 మంది పురు ష ఓటర్లు, 18,22,461 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కొత్తగా 1,86,464 మంది ఓటు హక్కు పొందారని విక్రమ్ కపూర్ వెల్లడించారు. కాంచీపురం, కోవై, తిరుచ్చి, తంజావూరు తదితర జిల్లాల్లో కూడా ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement