భర్తపై వేడి నూనె పోసిన భార్య
కేకేగర్: కోపంతో భర్తపై వేడినూనె పోయడంతో తీవ్ర గాయాలైన సంఘటన తమిళనాడులోని అరవకురిచ్చి నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాలు.. కరూర్ జిల్లా చిన్నతారాపురం సమీపంలోని రంగపాళెయంలో నివసిస్తున్న పళనిస్వామి కుమారుడు రాజేష్ కుమార్ (29) రేవతి(27) భార్యా భర్తలు. ఆదివారం సాయంత్రం ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆగ్రహానికి గురైన భార్య గ్యాస్‌స్టౌవ్‌పై కాగుతున్న నూనెను రాజేష్ కుమార్‌పై పోసింది.
అతను పెద్ద కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి గాయాలైన అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దీనిపై చిన్నతారాపురం పోలీసులు విచారణ చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజేష్ కుమార్ అరవకురిచ్చి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశాడు. వీరికి దివైన్ (5) టోమిని (2) పిల్లలు ఉన్నారు.