మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య | Woman techie from West Bengal stabbed to death in Pune, investigation on | Sakshi
Sakshi News home page

మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య

Published Mon, Dec 26 2016 6:33 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

Woman techie from West Bengal stabbed to death in Pune, investigation on

పుణె: మహారాష్ట్రలోని పుణెలో అంతరా దాస్‌ (23) అనే మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగుడు హత్య చేశాడు. వివరాలను పోలీసులు ఆదివారం వెల్లడించారు. అంతర పనిచేసే క్యాప్‌జెమిని కంపెనీకి అర కిలోమీటరు దూరంలోనే ఈ ఘోరం జరిగింది. బెంగాల్‌కు చెందిన ఆమె గతంలో బెంగళూరులో శిక్షణ పొందుతున్న సమయంలో సహోద్యోగి ఆమె వెంట పడేవాడని అంతర తల్లిదండ్రులు చెప్పారు.

శుక్రవారం కూడా వీరి మధ్య గొడవ జరగటమే హత్యకు దారితీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రాత్రి అంతర, నీలం–బులుగు రంగుల టీ–షర్ట్‌ ధరించిన ఓ వ్యక్తి రోడ్డు పక్కన వాదులాడుకుంటూ కనిపించారని.. అనంతరం ఆయన అంతరను పదునైన ఆయుధంతో పొడిచి పారిపోయాడని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. అంతరను వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. ఇతర కోణాల్లోనూ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement