సాక్షి, న్యూఢిల్లీ: రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో మాత్రమే కాదు సొంత ఇంట్లో కూడా నగర మహిళలకు భద్రత లేకుండా పోతోంది. మహిళలకు అపరిచిత వ్యక్తుల కన్నా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తెలిసిన వారి నుంచే ఎక్కువ ముప్పు ఉందని ఢిల్లీ పోలీసులు ఢిల్లీ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నందితా ధర్ అనే సామాజిక కార్యకర్త దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న ఢిల్లీ హైకోర్టు రాజధాని నగరంలో జరుగుతున్న నేరాల మ్యాపింగ్, విశ్లేషణ సమర్పించవలసిందిగా పోలీసుల ను గతంలో ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు న్యాయస్థానానికి మంగళవారం ఒక అఫిడవిట్ సమర్పించారు.
ఈ సంవత్సరం జనవరి నుంచి అక్టోబర్ వరకు ఢిల్లీలో 1,704 రేప్ కేసులు నమోదయ్యాయని వాటిలో కేవలం 4.3 శాతం కేసులలో మాత్రమే అత్యచారానికి పాల్పడిన వారు బాధితులకు పూర్తి అపరిచితులని పోలీసు ఆ నివేదిక తెలిపింది. మిగతా కేసులలో నిందితులు బాధితుల కుటుంబ సభ్యులు లేక పరిచితులేనని ఆ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది నమోదైన 241 అత్యాచారం కేసులలో తండ్రి , సవతి తండ్రి, సోదరుడు, బావ, పెదనాన్న-చిన్నాన్న కుమారులు, మామ, బాబాయి, మేనమామలు నిందితులని పోలీసుల గణాంకాలు తెలుపుతున్నాయి. ఇక 430 కేసులలో పొరుగున నివసించే వ్యక్తి లేదా కుటుంబ మిత్రుడు నిందితులుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. అత్యచార బాధితులలో 35 శాతం మంది 16 సంవత్సరాల లోపు వారని, 26 శాతం మంది 25 సంవత్సరాల వయసువారని పోలీసు అఫిడవిట్ తెలిపింది. పోలీసులు 1,613 కేసులలో నిందితులను అరెస్టు చేశారని అపిడవిట్ పేర్కొంది. జనవరి నుంచి అక్టోబర్ వరకు 3,485 లైంగిక వేధింపుల కేసులు నమోదయ్యాయని, వాటిలో 1,451 మంది బాధితులు 25 సంవత్సరాలకు పైబడిన వయసువారని పోలీసులు తెలిపారు.
అత్యచార కేసులలో బాధితులు, నిందితులు ఆర్థికంగా, సామాజిక దిగవ స్థాయి వర్గాలకు చెందినవారని, వారిలో ఎక్కువ మంది పెద్దగా చదువు సంధ్యలు లేని వారని కూడా పోలీసు గణాంకాలు వెల్లడించాయి. అత్యాచార బాధితులలో 64 శాతం మంది పేద కుటుంబాలకు చెందినవారున్నారు. అయితే లైంగిక వేధింపుల కేసులు ఎక్కువగా మధ్య తరగతివారు సమోదు చేస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. అత్యాచారం కేసు నిందితులలో 8 శాతం కన్నా తక్కువ మంది, వేధింపుల కేసులలో 3 శాతం కన్నా తక్కువ మంది 16 సంవత్సరాల లోపువారని ఆ నివేదిక పేర్కొంది. ఈ రెండు రకాల కేసులలో నిందితులు ఎక్కువగా 18 -26 సంవత్సరాల వయసువారు ఉన్నారు.
రేప్ కే సులలో నిందితులు:
నిందితుడు కేసులు
తండ్రి 43
సవతి తండ్రి 23
సోదరుడు 27
భర్త/ మాజీ భర్త 27
బాబాయి/ మేనమామ 32
కజిన్ 4
మామ 8
అల్లుడు 3
బావ 74
పొరుగువారు 352
కుటుంబమిత్రుడు 83
మిత్రుడు 642
అపరిచితుడు 72
నిందితుడు కేసులు
లైంగిక వేధింపుల కేసులలో నిందితులు:
నిందితుడు కేసులు
తండ్రి 33
సవతి తండ్రి 6
సోదరుడు 9
భర్త/ మాజీ భర్త 38
బాబాయి/ మేనమామ 29
కజిన్ 14
మామ 58
సవతి కొడుకు 3
అక్కభర్త 138
పొరుగువారు 977
కుటుంబమిత్రుడు 91
మిత్రుడు 115
అపరిచతుడు 727
ఇంట్లో కూడా భద్రతలేని మహిళ
Published Wed, Nov 19 2014 10:32 PM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement
Advertisement