ప్రేమించమంటూ విద్యార్థినిని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తనను ప్రేమించకుంటే స్వాతికి పట్టిన గతే నీకు పడుతుందని
	 టీనగర్: ప్రేమించమంటూ విద్యార్థినిని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. తనను ప్రేమించకుంటే స్వాతికి పట్టిన గతే నీకు పడుతుందని సదరు విద్యార్థినిని భయపెట్టాడీ ప్రబుద్ధుడు. ఇటీవల నుంగంబాక్కం రైల్వేస్టేషన్‌లో మహిళా ఇంజినీరు స్వాతి హత్యకు గురైన విషయం తెలిసిందే. మనలి చిన్న సేక్కాడు వవుసి వీధికి చెందిన ఏళుమలై కుమార్తె తిరువొత్తియూర్‌లోని ఒక ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది. ఈమె సెల్‌ఫోన్‌కు గుర్తు తెలియని యువకుడు ఫోన్ చేసి తనను ప్రేమించాలని,లేకపోతే స్వాతికి పట్టిన గతే పడుతుందని బెదిరించాడు. ఈ విషయాన్ని  యువతి తండ్రికి తెలిపింది. ఏళుమలై మనలి పుదునగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో అదే ప్రాంతానికి చెందిన ప్రభుకుమార్ (19) విద్యార్థినిని బెదిరించినట్లు తెలిసింది.
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
