నేటి నుంచి రైతు భరోసా యాత్ర | Ys jagan Raithu Barosa Yatra from today | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రైతు భరోసా యాత్ర

Published Thu, Jan 5 2017 3:42 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

నేటి నుంచి రైతు భరోసా యాత్ర - Sakshi

నేటి నుంచి రైతు భరోసా యాత్ర

కర్నూలు జిల్లా శ్రీశైలం నుంచి ప్రారంభం
శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జగన్‌ పర్యటన


సాక్షి ప్రతినిధి, కర్నూలు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేటి నుంచి కర్నూలు జిల్లాలో ‘రైతు భరోసా యాత్ర’ చేపట్టనున్నారు. శ్రీశైలం నుంచి ప్రారంభమయ్యే ఈ భరోసా యాత్ర మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో జరగనుంది. అప్పుల బాధతో, రుణమాఫీ అమలుకాక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఈ సందర్భంగా ఆయన భరోసా ఇవ్వనున్నారు.  ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్‌ నుంచి నేరుగా లింగాలగట్టుకు చేరుకుని శ్రీశైలం డ్యాంను పరిశీలించనున్నారు. అనంతరం సున్నిపెంట మీదుగా శ్రీశైలం చేరుకుని అక్కడే బస చేస్తారు.

అనంతరం 6వ తేదీన శ్రీశైలంలో మల్లన్న దర్శనం అనంతరం ఆత్మకూరు చేరుకుని బహిరంగసభలో ప్రసంగించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి తెలిపారు. మొదటి విడతలో శ్రీశైలం, నంద్యాల నియోజకవర్గాల్లో ఈ నెల 11వ తేదీ వరకూ భరోసా యాత్ర జరుగుతుందని పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్‌ తలశిల రఘురాం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement