వివాహిత కోసం ఇద్దరి మధ్య ఘర్షణ | Fight Between Two Person For Married Women In Tamilnadu | Sakshi
Sakshi News home page

వివాహిత కోసం ఇద్దరి మధ్య ఘర్షణ

Published Sat, Nov 23 2019 10:26 AM | Last Updated on Sat, Nov 23 2019 10:26 AM

Fight Between Two Person For Married Women In Tamilnadu - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: వివాహమై ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఉపాధ్యాయురాలి కోసం ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు. ఒకరిపై ఒకరు కత్తులతో దాడి చేసుకున్నారు. తమిళనాడులోని అరియలూరు జిల్లా తిరుమళంపాడి మారియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన నటరాజన్‌ కుమారుడు రాజరాజన్‌ (28)అవివాహితుడు. అతనికి ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఓ వివాహితతో పరిచయం ఏర్పడింది. అనంతరం అది వివాహేతర సంబంధానికి దారి తీసింది. కొన్ని రోజుల పాటు వారి బంధం అలాగే కొనసాగింది.  ఈ క్రమంలోనే ఆమెకు అదే పాఠశాలలో పని చేస్తున్న హెన్రి (40) అనే ఉపాధ్యాయుడితో స్నేహం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ సంగతి రాజరాజన్‌కు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే హెన్రీ, రాజరాజన్‌ల మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. హెన్రీ మద్దతుదారులు రాజరాజన్‌పై కట్టెలతో దాడి చేసి కత్తులతో పొడిచి గాయపరిచారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు హెన్రీని అరెస్టు చేశారు. ఘటనపై మరింత విచారణ జరుపుతున్నారు. ఉపాధ్యయురాలిని విచారిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement