
సాక్షి, చెన్నై: తై మాసం ఆవిర్భావంతో పురుషులకు ప్రమాదం పొంచివున్నట్లు వదంతులు వ్యాపించడంతో విళ్లుపురం పరిసర ప్రాంతాల మహిళలు తమ ఇళ్ల ముంగిట దివ్వెలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తై మాసం మొదటి రోజు, తమిళుల పొంగల్ పండుగ రోజున ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. దీంతో ఆదివారం పొంగల్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.
ఆరోజు సాయింత్రం 5.09 గంటలకు ఉభయ లగ్నంలో సూర్యుడు అస్తమించే సమయాన తై మాసం అవిర్భవించింది. ఇది ఘోర అనే దేవత ద్వారా రాజగోపలంలో తూర్పు వైపుగా పుట్టిందని, ఈ కారణంగా ఇళ్లలోని పురుషులకు ప్రమాదమని, దీంతో మహిళలు పరిహార పూజలు చేయాలన్న వదంతులు విళ్లుపురం పరిసర ప్రాంతాల్లో ప్రాంతంలో గత రెండు రోజులుగా వ్యాపించాయి. దీంతో ఈ ప్రాంతాల మహిళలు తమ ఇళ్ల ముంగిట దివ్వెలను వెలిగించి ఇళ్లలో పరిహార పూజలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment