ఆ ఫోన్ కొంటే 28జీబీ 4జీ డేటా
ఆ ఫోన్ కొంటే 28జీబీ 4జీ డేటా
Published Wed, Mar 22 2017 11:14 AM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM
చైనీస్ కంపెనీ షియోమి తాజాగా భారత్ లో లాంచ్ చేసిన రెడ్ మి 4ఏ కొనుగోలు చేసిన వారికి కంపెనీ లాంచ్ ఆఫర్లు ప్రకటించింది. ఈ మొబైల్ కొన్న ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు 28జీబీ డేటాను కంపెనీ తెలిపింది. మి.కామ్, అమెజాన్ రెండు ఆన్ లైన్ ప్లేస్ లో ఈ ఫోన్ ను కంపెనీ ఆవిష్కరించింది. రెడ్ మి 4ఏను అధికారికంగా లాంచ్ చేసిన వెంటనే ఐడియా కస్టమర్ల కోసం కంపెనీ ఈ లాంచ్ ఆఫర్లను ప్రకటించింది. అయితే ఈ ఫోన్ కొనుగోలు చేసి రూ.343 లతో రీఛార్జ్ ప్యాక్ వేసుకుంటేనే ఈ 28జీబీని పొందుతారని కంపెనీ పేర్కొంది. మరోవైపు ఈ ఆఫర్లన్నీ కూడా అమెజాన్ ఇండియాలో కొనుగోలు చేసి వారికే వర్తించనున్నాయి.
అమెజాన్ ఇండియాలో రెడ్ మి4ఏ ను కొనుగోలు చేసిన ఐడియా ప్రీపెయిడ్ కస్టమర్లకు 28జీబీ 4జీ డేటాను రూ.343 ప్యాక్ తో అందించనున్నామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ప్యాక్ కింద రోజుకు 1జీబీ డేటా వాడుకోవచ్చని పేర్కొంది. దాంతో పాటు రెడ్ మి4ఏ కస్టమర్లు రోజుకు 300 నిమిషాల ఉచిత కాల్స్, నెలకు 3000 లోకల్, ఎస్టీడీ ఎస్ఎంఎస్ లను పొందనున్నారని షియోమి వెల్లడించింది. ఈ రీచార్జ్ ప్యాక్ కేవలం 28 రోజుల వరకే ఉండనుంది. 28 రోజుల తర్వాత కూడా రూ343 ప్యాక్ పై ఈ ఆఫర్లనే పొందవచ్చు. ఈ 2017 జూన్ 30 తర్వాత ఈ ప్యాక్ గడువు ముగుస్తుంది. రెడ్ మి 4ఏ గురువారం నుంచి మి.కామ్, అమెజాన్ ఇండియాల్లో విక్రయానికి రానుంది. దీనిధర రూ.5,999. ఆఫ్ లైన్ ద్వారా ఇది అందుబాటులో ఉండదు. మి.కామ్ లో కొనుగోలుచేసిన కస్టమర్లకు ఎలాంటి ఆఫర్లను కంపెనీ ప్రకటించలేదు.
Advertisement
Advertisement