
లారీని ఢీకొన్నఆర్టీసీ బస్సు... డ్రైవర్ మృతి
కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల కేంద్రం శివార్లలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మెట్ పల్లి వైపు వెళుతుండగా కమ్మర్ పల్లి శివార్లకి రాగానే బస్సు మందు చక్రం పేలిపోయింది. దాంతో అదుపుతప్పిన బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఏడుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
బస్సు ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ అందులో చిక్కుకుపోయాడు. అతికష్టం మీద స్తానికులు అతడిని బయటకు తీశారు. క్షతగాత్రులను 108లో కమ్మర్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.