రూ.10,800 కోట్లతో తెలంగాణలో రోడ్ల అభివృద్ధి
హైదరాబాద్: తెలంగాణలో 10,800 కోట్ల రూపాయలతో రహదారి అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో మంత్రి సమీక్ష నిర్వహించారు.
బుధవారం తెలంగాణలో రెండు జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు గడ్కరీ శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణలో వివిధ దశల్లో చేపట్టిన రోడ్ల అభివృద్ధి పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు మంత్రి చెప్పారు. నాణ్యతాలోపాలు ఉంటే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.