హైదరాబాద్: టీటీడీపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూధనాచారీ శుక్రవారం ఓ రోజుపాటు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయిన టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, ఏ గాంధీ, రేవంత్ రెడ్డి, ఎం.మాధవరావు, మంచిరెడ్డి కిషన్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ప్రకాశ్గౌడ్, సాయన్న రాజేందర్రెడ్డి, మాగంటి గోపినాథ్లు ఉన్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైయిన సంగతి తెలిసిందే. అయితే రెండవ రోజు అయిన శుక్రవారం సభ ప్రారంభం కాగానే రైతుల ఆత్మహత్యలపై చర్చ జరగాలని టీటీడీపీ నేతలు పట్టుబట్టారు. బడ్జెట్పై చర్చ అనంతరం రైతుల ఆత్మహత్యపై చర్చింద్దామని అధికార పక్షం వెల్లడించింది. ముందే రైతుల ఆత్మహత్యలపై చర్చించాలని టీటీడీపీ సభ్యులు పట్టుపట్టారు. ఆ క్రమంలో సభ రెండు సార్లు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైనా టీటీడీపీ సభ్యులు తమ పట్టువీడవకపోవడంతో సభ కార్యక్రమాలకు అడ్డుతగులతుండటంతో స్పీకర్ వారిపై ఓ రోజుపాటు సస్పెన్షన్ వేటు వేశారు.