MLAs Suspended
-
టీడీపీ సభ్యుల తిట్లపురాణం.. తాము చెప్పినట్లే సభ జరగాలని హంగామా!
సాక్షి, అమరావతి: శాసనసభలో రెండో రోజు శుక్రవారం కూడా టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించారు. స్పీకర్ పోడియంపైకి ఎక్కి నినాదాలు చేస్తూ సభ జరగకుండా అడ్డుకునేందుకు విఫలయత్నం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాంను ఏకవచనంతో సంబోధిస్తూ అవమానకరంగా మాట్లాడారు. సభలో ప్రభుత్వం ప్రారంభించిన చర్చ జరగకుండా అడ్డుకోవడం, గొడవ చేయడం ద్వారా సస్పెన్షన్ వేటు వేయించుకుని సభ నుంచి బయటకు వెళ్లిపోవడమే లక్ష్యంగా టీడీపీ ఎమ్మెల్యేలు హంగామా చేశారు. ప్రశ్నోత్తరాల తర్వాత తాము వాయిదా తీర్మానం ఇచ్చిన ధరల పెరుగుదలపై చర్చ జరగాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. దాన్ని తిరస్కరించినట్లు చెప్పిన స్పీకర్ బిల్లులు ప్రవేశపెట్టేందుకు అనుమతించారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా ప్ల కార్డులు పట్టుకుని బాదుడే బాదుడు అంటూ నినాదాలు చేసుకుంటూ స్పీకర్ పోడియంపైకి ఎక్కారు. ఒకవైపు మంత్రులు బిల్లులు ప్రవేశపెడుతున్నా పట్టించుకోకుండా వారు మాట్లాడే విషయాలు వినపడకుండా పోడియంను కొడుతూ పెద్దగా నినాదాలు చేశారు. స్పీకర్‌ను తిడుతూ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జోక్యంచేసుకుని ఉద్దేశపూర్వకంగా సభలో గందరగోళం సృష్టిస్తున్నారని సభను ఆర్డర్లో పెట్టాలని స్పీకర్‌ను కోరారు. స్పీకర్ ఎంతచెప్పినా వినకుండా టీడీపీ ఎమ్మెల్యేలు గొడవచేస్తూనే ఉన్నారు. దీంతో శాసనసభా వ్యవహారాల సమన్వయకర్త గడికోట శ్రీకాంత్‌రెడ్డి జోక్యం చేసుకుని కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం ఉన్న విషయం తెలిసి కూడా ధరల గురించి టీడీపీ సభ్యులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలిపారు. బిల్లులు ప్రవేశపెట్టకుండా అడ్డుకునేలా టీడీపీ సభ్యులు మరింత రెచ్చిపోవడంతో సభ సజావుగా జరిగేందుకు వారిని సస్పెండ్ చేయాలని బుగ్గన రాజేంద్రనాథ్ ప్రతిపాదించారు. ఈ సమయంలోనూ టీడీపీ సభ్యులు స్పీకర్‌పైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వీరిని ఆపుతున్న మార్షల్స్‌ని నెట్టేస్తూ వారితో వాగ్వాదానికి దిగి దుర్భాషలాడారు. మార్షల్స్ ఐడీ కార్డులు అడుగుతూ వారిని తోసేయడంతో గందరగోళం నెలకొంది. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు బెందాళం అశోక్, కింజరాపు అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, గణబాబు, వేగుళ్ల జోగేశ్వరరావు, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, బాల వీరాంజనేయస్వామిలను సభ నుంచి ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. ఆ తర్వాత కూడా వారు బయటకెళ్లకుండా మార్షల్స్‌తో తోపులాటకు దిగారు. తన అనుమతితోనే మార్షల్స్ సభలోకి వచ్చారని వారిని ఐడీ కార్డులు అడగడం ఏమిటని గట్టిగా హెచ్చరించడంతో టీడీపీ సభ్యులు గట్టిగా అరుపులు, కేకలు వేసుకుంటూ బయటకెళ్లిపోయారు. టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆవేదన స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. ముఖ్యమైన బిల్లులు ప్రవేశపెడుతుంటే అవేంటో కూడా తెలియకుండా సభను అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది చాలా బాధాకరమని ప్రతిరోజు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి గొడవ చేస్తున్నారని వాపోయారు. వాళ్లవల్ల మిగిలిన సభ్యులంతా ఇబ్బంది పడుతున్నారన్నారు. వారిపట్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని శాసనసభా వ్యవహారాల మంత్రికి సూచించారు. సంస్కారం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న తనకు చాలా బాధగా ఉందన్నారు. -
కాంగ్రెస్‌లో కలకలం.. ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్
Congress MLAs Suspended.. జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారులో నోట్ల కట్టలు బయటపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కచ్చప్, నమన్ బిక్సల్ కొంగరిలను శనివారం రాత్రి బెంగాల్‌లోని హౌరా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా.. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ సస్పెన్షన్ వేటు వేసింది. భారీ మొత్తంలో డబ్బుతో పోలీసులకు పట్టుబడిన నేపథ్యంలో వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని జార్ఖండ్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి అవినాశ్ పాండే తెలిపారు. మరోవైపు.. జార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. #BREAKING Wads of cash recovered from the vehicle of sitting #Congress MLA from #Jharkhand. Vehicle belongs to Irfan Ansari, MLA #Jamtara. He himself & 2 more congress MLAs - Rajesh Kachhap & Naman Bixal Kongari were travelling to Jharkhand when Howrah police intercepted the car. pic.twitter.com/rerct6Kiip — Tamal Saha (@Tamal0401) July 30, 2022 ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందిన కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ కమల్లో భాగంగానే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేశారని అంటున్నారు. దీంతో, కాంగ్రెస్ నేతల వ్యవహారం పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తోంది. Delhi | The three MLAs, who were held with a mountain of cash yesterday, have been suspended from the party with immediate effect: Avinash Pande, General Secretary and In-charge, Jharkhand Congress pic.twitter.com/fkHpec45XJ — ANI (@ANI) July 31, 2022 ఇది కూడా చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యేల కారులో భారీగా నగదు కట్టలు! -
ఇది గౌరవ సభ.. రౌడీల్లా ప్రవర్తించొద్దు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరు మారలేదు. జంగారెడ్డిగూడెంలో మద్యం మరణాలంటూ అసత్య ఆరోపణలతో సోమవారమూ గందరగోళం సృష్టించారు. వారి నిరసనలు శృతి మించడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేశారు. సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు పోడియం చుట్టిముట్టి నినాదాలు చేశారు. వారి నిరసనల మధ్యే స్పీకర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. పది నిమిషాల తర్వాత టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, అనగాని సత్యప్రసాద్ స్పీకర్‌కు రక్షణగా ఉన్న సిబ్బందిని తోసేశారు. ఇది సరైన పద్థతి కాదని, వారి స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ హితవు చెప్పారు. అయినా వినకపోవడంతో మార్షల్స్ వచ్చి టీడీపీ సభ్యులను వారి స్థానాల వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి వారు వీరంగం సృష్టించారు. ఖాళీ వాటర్ బాటిళ్లు, పుస్తకాలతో బల్లలను చరుస్తూ, స్పీకర్‌ను నిందిస్తూ నినాదాలు చేశారు. దీనిపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది గౌరవ శాసన సభ. బజారు కాదు. మీరు వీధి రౌడీలు కారు. ఇలా ప్రవర్తించడం సరికాదు. సభకు, స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. సంస్కారం, మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు. మత్స్యకారుల సమస్యలు, మహిళా సంక్షేమం వంటి ముఖ్యమైన అంశాలపై చర్చ జరుగుతుంటే ఈ విధంగా ప్రవర్తించడం సరికాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో ఉన్న తెలుగుదేశం పార్టీ సభ్యులందరినీ ఒక రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. టీడీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిన అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. ‘ప్రతి రోజూ సభను అడ్డుకోవడమే లక్ష్యంగా వస్తున్నారు. గత వారం రోజులుగా మంచి అంశాలపై చర్చలో పాల్గొనలేకపోయారు. కనీసం గౌరవ సభకైనా గౌరవం ఇవ్వాలిగా. గవర్నర్‌కు, స్పీకర్‌కు, ప్రజలు ఎన్నుకున్న సీఎంకు కూడా గౌరవం ఇవ్వడంలేదు. ఇలాంటి ప్రవర్తనకు అడ్డుకట్ట వేయాల్సిందే. స్పీకర్‌కు ఉన్న విచక్షణాధికారాలు ఉపయోగించడం చాలా చిన్న పని. కానీ సభను గౌరవంగా నడపాలని చూస్తుంటే అల్లరి మూకలు మాదిరిగా బాటిళ్లు, పుస్తకాలు చించుతూ ఇష్టం వచ్చినట్లు కేకలు వేయడం సహించలేనిది. ఎన్ని రూలింగ్స్ ఇచ్చినా ఉపయోగం లేకుండా పోతోంది. ఇటువంటి ప్రవర్తన పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవడానికి సభ్యులు ఎథిక్స్ కమిటీకి సూచనలు ఇవ్వాలి’ అని కోరారు. చదవండి: ఏపీ ప్రభుత్వ చొరవ.. అమూల్ రాకతో పాలకు మంచి ధర కఠిన చర్యలు తీసుకోండి టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని, సభ ఔన్నత్యాన్ని కాపాడాలని మంత్రి కన్నబాబు కోరారు. ‘చంద్రబాబు సభను అకారణంగా బాయ్‌కాట్ చేసి ఎక్కడో కూర్చొని సభలో రాజకీయాలు చేస్తున్నారు. బాబులాంటి దిగజారుడు రాజకీయాలు చేసే నాయకుడు ఎవరూ ఉండరు. దుర్మార్గంగా సభా సమయాన్ని అడ్డుకుంటున్నారు. ఎథిక్స్ కమిటీలో కీలక నిర్ణయాలు తీసుకోవాలి. టీడీపీ సభ్యులను కంట్రోల్ చేయకపోతే సభ ఔన్నత్యం దెబ్బతింటుంది’ అని కన్నబాబు అన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భక్తులు అయ్యప్పమాల వేసుకుంటే ప్రభుత్వం ఆదాయం పడిపోతుందంటూ బహిరంగంగా భాదపడిన వ్యక్తికి లిక్కర్ అమ్మకాలపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. గత ప్రభుత్వం విచ్చలవిడిగా కొత్త బ్రాండ్లు, డిస్టలరీలకు అనుమతినిచ్చి రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించిందని, ఇప్పుడు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని విమర్శించారు. -
బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు కారణాలేంటి?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్‌రావులను సస్పెండ్ చేయడానికి కారణాలేంటో తెలపాలని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్‌ను హైకోర్టు ఆదేశించింది. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన ఈ నెల 7న సభలో ఏం జరిగిందో చెప్పాలంది. సమావేశాల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి పిటిషనర్ సమర్పించిన వీడియో సరైనది కాదన్నప్పుడు సభలో రికార్డు చేసిన ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించిన వీడియోను సమర్పించడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించింది. శాసనసభ కార్యదర్శి, శాసనసభ సెక్రటేరియట్ కార్యదర్శిలకు నోటీసులు జారీ చేస్తున్నామని, సస్పెన్షన్‌కు కారణాలు తెలియజేయాలని స్పష్టం చేసింది. తమను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్ చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ షమీమ్ అక్తర్ బుధవారం విచారించారు. సరైన కారణాల్లేకుండానే సస్పెన్షన్ సరైన కారణాలు లేకుండానే బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిబంధనల ప్రకారం సభ వ్యవ హారాలను అడ్డుకున్న సభ్యు డి పేరును స్పీకర్ ప్రస్తావించాలని, వారిని సస్పెండ్ చేయాలని కోరుతూ శాసనసభ వ్యవహారాల మంత్రి తీర్మానాన్ని ప్రతిపాదించాల్సి ఉంటుందని అన్నారు. స్పీకర్ ఎవరి పేరును ప్రస్తావించకుండానే ముందు రాసుకొచ్చిన మేరకు బీజేపీకి చెందిన ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ తీర్మానం ప్రతిపాదించారని తెలిపారు. గవర్నర్‌ను ఆహ్వానించకపోవడంపై బీజేపీ సభ్యులు నిరసన తెలిపారని.. రాజేందర్, రఘునందన్‌రావులు తమ స్థానాల్లో ఉండి నిరసన తెలిపారని, రాజాసింగ్ స్పీకర్ స్థానం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారని వివరించారు. స్పీకర్ స్థానం వైపు వెళ్లినంత మాత్రాన సస్పెం డ్ చేయడానికి వీల్లేదని.. రాజ్యాంగ, చట్ట నిబంధనలకు విరుద్ధంగా వారిని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. చదవండి: (Telangana Assembly: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్) సస్పెన్షన్ ఉత్తర్వులను ఇవ్వట్లేదు సస్పెండ్ ఉత్తర్వులను పిటిషన్‌తో పాటు ఎందుకు సమర్పించలేదని ప్రకాశ్‌రెడ్డిని ప్రశ్నిం చగా.. తాము కోరినా శాసనసభ కార్యదర్శి ఇవ్వడం లేదని తెలిపారు. వీరిని సస్పెండ్ చేసినట్లు అన్ని ప్రసార మాధ్యమాల్లో వచ్చిందని, ఓ చానల్లో వచ్చిన వీడియోను సమర్పించామని తెలిపారు. సస్పెండ్ చేస్తూ జారీచేసిన ఉత్తర్వులతో పాటు 7న సభా వ్యవహారాలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారం వీడియోను సమర్పించేలా ఆదేశించాలని కోరారు. ఏజీ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. సభ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లే దని నివేదించారు. సమావేశాలకు సంబంధిం చి పిటిషనర్ సమర్పించిన వీడియో సరైనది కాదన్నారు. విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేశారు. -
Telangana Assembly: బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
సాక్షి, హైదరాబాద్: బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. సభ నుంచి బయటకు వెళ్లాల్సిందిగా పదే పదే విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో రంగంలోకి దిగిన మార్షల్స్ వారిని బయటకు తీసుకెళ్లారు. సోమవారం ఉదయం 11.30కు సమావేశాలు ప్రారంభం కాగా, జాతీయ గీతాలాపన తర్వాత స్పీకర్ ఆదేశాల మేరకు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 2022–23 వార్షిక బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించారు. అయితే గవర్నర్ ప్రసంగం లేకుండా నేరుగా బడ్జెట్ ప్రసంగంతో సభను ప్రారంభించడంపై కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తమ స్థానాల నుంచి లేచి నిలబడి అభ్యంతరం వ్యక్తం చేశారు. నల్ల కండువాలు ధరించి సభకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు గవర్నర్ ప్రసంగం లేకపోవడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్థిక మంత్రి ప్రసంగం కొనసాగుతున్న క్రమంలో పది నిమిషాల తర్వాత బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వెల్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, ఈటల రాజేందర్, రఘునందన్‌రావు తమ స్థానాల వద్ద నిల్చుని మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రి ప్రసంగానికి అడ్డు తగులుతుండటంతో.. సీఎం కేసీఆర్ సూచన మేరకు హరీశ్‌రావు ప్రసంగం ఆపడం, మంత్రి తలసాని అసెంబ్లీ రూల్స్ 340, సబ్ రూల్ 2 ప్రకారం బీజేపీ ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని టీఆర్ఎస్ సభ్యులు బల్లలు చరుస్తూ ఆమోదించడంతో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలో బైఠాయింపు సస్పెండ్ అయిన ఎమ్మెల్యేలు సభనుంచి బయటకు వెళ్లేందుకు నిరాకరించడంతో మార్షల్స్‌ను పిలిపించారు. తొలుత రాజాసింగ్‌ను సభ నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో ‘కేసీఆర్ రాజ్యాంగం నడవదు’అంటూ రాజాసింగ్ నినదించగా, ‘మోదీ రాజ్యాంగం నడవదు’అని టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. రఘునందన్‌రావును కూడా మార్షల్స్ బయటకు తీసుకెళ్లగా, చీఫ్ మార్షల్ కరుణాకర్ ఈటల వద్దకు వెళ్లి సభ నుంచి వెళ్లాల్సిందిగా కోరడంతో ఆయన కూడా బయటకు వెళ్లిపోయారు. అసెంబ్లీ ఆవరణలో వారు ‘ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, కేసీఆర్ నియంతృత్వ వైఖరి నశించాలి’అంటూ నినాదాలు చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని బొల్లారం పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల నిరసన, వాకౌట్ ఆర్టికల్ 171 ప్రకారం రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభించే ముందు గవర్నర్ ప్రసం గం ఉండాలంటూ సోమవారం సభ ప్రారంభమైన వెంటనే కాంగ్రెస్ సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఈ మేరకు రాజ్యాంగం ప్రతిని చూపుతూ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, రాజగోపాల్‌రెడ్డి, జగ్గారెడ్డి, సీతక్క,, పోడెం వీరయ్య తమ స్థానాల్లో నిలబడి మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. సుమారు అరగంట పాటు ఆ విధంగా విజ్ఞప్తి చేసినా స్పీకర్ స్థానం నుంచి స్పందన లేకపోవడంతో 12 గంటల సమయంలో కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. -
గొంతు నొక్కేయాలని చూస్తున్నారు
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రతిపక్షమే లేకుండా గొంతునొక్కేయాలని చూస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వ చర్యలు అప్రజాస్వామికం అని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విమర్శించారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం సరికాదని చెప్పారు. ఏ ఉద్యమాలను ఉపయోగించి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో ఇప్పుడు వాటినే అణచివేస్తూ నిజాం పాలనను తలపిస్తున్నారని మండిపడ్డారు. విభజన హామీలు అమలు చేయలేదని తమ కేంద్ర మంత్రులను ఉపసంహరించుకున్న టీడీపీ ఇంకా ఎన్డీయేలో కొనసాగుతుండటం దేనికి సంకేతమని ఆయన ప్రశ్నించారు. కేంద్రం తీరుపై అసెంబ్లీలో ఏడ్పులు, పార్లమెంటులో ధర్నాలు చేస్తున్న టీడీపీ ఇంకా ఎన్డీయేలో ఎందుకు కొనసాగుతోందని ప్రశ్నించారు. -
ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం దారుణం
హైదరాబాద్ : బీసీ ఎమ్మెల్యేలను సస్సెండ్ చేయడం దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ... దాడిశెట్టి రాజా ఏం తప్పు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం ద్వారా బీసీల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. బీసీలకు తమ పార్టీ అండగా ఉంటుందని చెవిరెడ్డి భాస్కరరెడ్డి స్పష్టం చేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్ష వైఎస్ఆర్ సీపీ పట్టుపట్టింది. అందుకు స్పీకర్ అనుమతి నిరాకరించారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ సీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి సభ ప్రారంభమైనా వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు చేరి చర్చకు పట్టుపట్టారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ క్రమంలో కెమెరాలకు అడ్డువస్తున్నారంటూ వైఎస్ఆర్ సీపీ సభ్యులు శివప్రసాద్‌రెడ్డితోపాటు దాడిశెట్టి రాజాలను రెండు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. -
టీటీడీపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్: టీటీడీపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూధనాచారీ శుక్రవారం ఓ రోజుపాటు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయిన టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, ఏ గాంధీ, రేవంత్ రెడ్డి, ఎం.మాధవరావు, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, ప్రకాశ్‌గౌడ్, సాయన్న రాజేందర్‌రెడ్డి, మాగంటి గోపినాథ్‌లు ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైయిన సంగతి తెలిసిందే. అయితే రెండవ రోజు అయిన శుక్రవారం సభ ప్రారంభం కాగానే రైతుల ఆత్మహత్యలపై చర్చ జరగాలని టీటీడీపీ నేతలు పట్టుబట్టారు. బడ్జెట్‌పై చర్చ అనంతరం రైతుల ఆత్మహత్యపై చర్చింద్దామని అధికార పక్షం వెల్లడించింది. ముందే రైతుల ఆత్మహత్యలపై చర్చించాలని టీటీడీపీ సభ్యులు పట్టుపట్టారు. ఆ క్రమంలో సభ రెండు సార్లు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైనా టీటీడీపీ సభ్యులు తమ పట్టువీడవకపోవడంతో సభ కార్యక్రమాలకు అడ్డుతగులతుండటంతో స్పీకర్ వారిపై ఓ రోజుపాటు సస్పెన్షన్ వేటు వేశారు.