నడుస్తున్న సర్వీసులు
డ్రైవర్లు విధుల్లోనే
సమ్మెలో పారామెడికల్ సిబ్బంది
బాధ్యతలు చూస్తున్న సీహెచ్‌సీలు
కరీంనగర్ హెల్త్ : డిమాండ్ల సాధనకు చేపట్టిన 108 ఉద్యోగుల సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగింది. బుధవారం అర్ధరాత్రి నుంచి 108 సైరన్ నిలిచింది. సంస్థ పర్యవేక్షణ బాధ్యతలు ప్రభుత్వమే నిర్వహించాలని, ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మెకు దిగారు. సమ్మె మూడు రోజులకు చేరుకున్న ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో ఆందోళనలు ఉధృతం చేయూలని ఉద్యోగుృు నిర్ణరుుంచారు. అరుుతే 108 సర్వీసులు మాత్రం నడుస్తూనే ఉన్నారుు. వీటి నిర్వహణ బాధ్యతలను సీహెచ్‌సీలు చూస్తున్నారు.
ప్రమాదాల్లో గాయపడి సరైన సమయం లో చికిత్స అందక ప్రతిరోజు వందల సంఖ్యలో చనిపోతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 108 అంబులెన్స్ వాహనాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆయన మరాణానంతరం 108 సర్వీసులు పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యాయి. క్రమంగా ఈ పథకాలకు బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో పర్యవేక్షణ బాధ్యతలు కష్టంగా మారారుు. డీజిల్ నిండుకుని మధ్యలోనే నిలిచిన సందర్భాలు కోకొల్లలు.
సిబ్బందికి వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యంతోపాటు పనిగంటలు పెంచి శ్రమదోపిడీకి గురి చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటులో మంచి రోజులు వస్తాయనే ఆశతో ఉద్యమంలో నూ పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిరాశే మి గిల్చింది. దీంతో నిరాశకులోనైన ఉద్యోగులు ఉ ద్యమిస్తేనే బతుకులు బాగుపడతాయని సమ్మెబాట పట్టినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
32 వాహనాలు, 155 మంది
జిల్లాలో 32 వాహనాలు ఉన్నారుు. వీటిలో చి గురుమామిడి, గోదావరిఖని వాహనాలు మరమ్మతులో మూలనపడ్డారుు. ప్రస్తుతం 30 వాహ నాలు నడుస్తుండగా.. 155మంది సిబ్బం ది పనిచేస్తున్నారు. వాహనాల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే సాకుతో నలుగురిని తొలగించారు.
108 ఉద్యోగుల డిమాండ్లు
108 వాహనాల నిర్వహణ ప్రభుత్వం తీసుకోవాలి.
సిబ్బందిని క్రమబద్ధీకరించడంతోపాటు వేతనాలు పెంచాలి.
విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను మళ్లీ తీసుకోవాలి
కక్షసాధింపు చర్యలు మానుకోవాలి.
డ్రైవర్లు విధుల్లోనే..
సమస్యలు పరిష్కరించాలని 108లోని పారామెడికల్ సిబ్బంది మాత్రమే సమ్మె చేస్తుండగా.. వాహన డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. వాహనాల నిర్వహణ బాధ్యతను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ)లకు అప్పగించింది ప్ర భుత్వం. వాహనంలో వైద్య సేవలు అం దించే పారామెడికల్ సిబ్బందికి బదులుగా సీెహ చ్‌సీలు, పీహెచ్‌సీల పరిధిలోని రెండో ఏఎన్‌ఎంలు, హెల్త్ అసిస్టెంట్లను వినియోగించుకుంటున్నారు. పగటిపూట రెండో ఏఎన్‌ఎంలు, రాత్రివేళల్లో హెల్త్ అసిస్టెంట్లు 108 వాహనాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 32 వాహనాలు పనిచేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
కొనసాగుతున్న 108 సమ్మె
Published Sat, May 16 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM
Advertisement