Paramedical staff
-
వైద్య సిబ్బంది కొరతను తక్షణమే తీర్చాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వైద్యాన్ని చౌకగా అందుబాటులోకి తీసుకురావడంతోపాటు సరైన సమయంలో వైద్యం అందించడాన్ని సైతం ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్య వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు స్థానికసంస్థలు, ప్రైవేటు, కార్పొరేట్ రంగం సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం వైద్య కళాశాల స్వర్ణ జయంతి వేడుకల సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవంలో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. మహిళలకు సరైన ప్రోత్సాహం అందించాలి దేశంలో వైద్యం మరింత ఖరీదవుతున్న నేపథ్యంలో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆ భారాన్ని మోయలేకపోతున్న విషయాన్ని ప్రతీ ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలన్నారు. స్నాతకోత్సవంలో పతకాలు అందుకున్న వారిలో ఎక్కువమంది యువతులు ఉండటాన్ని ప్రత్యేకంగా అభినందించిన వెంకయ్యనాయుడు... మహిళలకు సరైన ప్రోత్సాహాన్నందిస్తే ఏదైనా సాధించగలరనే దానికి ఇదొక నిదర్శనమని పేర్కొన్నారు. కరోనాపై పోరాటంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా వైద్యులు, వైద్య సిబ్బంది పోషించిన పాత్రను సమాజం ఎన్నటికీ మరిచిపోదన్నారు. అయితే దేశంలో వైద్యులు, రోగుల నిష్పత్తి మధ్య ఉన్న భారీ అంతరాన్ని తగ్గించేందుకు కృషి జరగాలని సూచించారు. వలసవాద విధానాలు విడనాడాలి ప్రతి జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజీ, తత్సంబంధిత ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, రానున్న రోజుల్లో ప్రతి రెవెన్యూ కేంద్రానికి ఒక సకల సౌకర్యాలున్న ఆసుపత్రి ఏర్పాటు జరగాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు. వైద్యరంగం అత్యంత పవిత్రమైన వృత్తుల్లో ఒకటన్న ఉపరాష్ట్రపతి, వైద్య విద్యార్థులు విధుల్లో చేరిన తర్వాత తమ బాధ్యతలను నిర్వర్తించే విషయంలో ఎలాంటి వివక్ష లేకుండా పనిచేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యల పరిష్కారంలో, అక్కడి ప్రజలకు వైద్యం అందించడంలో చొరవ తీసుకోవాలన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ కొన్ని వలసవాద విధానాలను కొనసాగించడంపై వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మన విధానాలను, మన అలవాట్లను భారతీయీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన దిశానిర్దేశం చేశారు. చట్టసభలు, విద్య, పరిపాలన, న్యాయ ఇలా అన్నిరంగాల్లోనూ భారతీయ విధానాలను అలవర్చుకోవాలన్నారు. న్యాయవ్యవస్థను జాతీయీకరించాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. చదవండి: మమతా బెనర్జీ ఇటలీ పర్యటనకు అనుమతి నిరాకరణ -
ఒక్క పోస్టులో తేడా వచ్చినా కఠిన చర్యలు
సాక్షి, అమరావతి: జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతోన్న మెడికల్, పారామెడికల్ సిబ్బంది నియామకాల విషయంలో ఎలాంటి పొరపాట్లూ జరగకూడదని, ఏ ఒక్క పోస్టు నియామకంలో తేడాలు వచ్చినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మెరిట్ లిస్ట్‌లో అనర్హుల పేర్లు ఉన్నాయని విజయవాడలో జరిగిన నియామకాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)తో పాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో మెరిట్‌లిస్ట్‌ను పున:పరిశీలన చేసి మళ్లీ ప్రకటించాలని అధికారులను వైద్యారోగ్య శాఖ ఆదేశించింది. ఈ నేపథ్యంలో సిబ్బంది ఎంపికను అత్యంత పారదర్శకంగా చేయాలని కలెక్టర్లకు సూచించింది. వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ ముగించి ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ అధికారులను ఆదేశించారు. -
50 వేలకు చేరువలో...
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కల్లోలం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. ఈ మహమ్మారి కాటు వల్ల మరణాలు, పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు.. 24 గంటల వ్యవధిలో 126 మంది మృతి చెందారు. అలాగే కొత్తగా 2,958 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా సంబంధిత మరణాలు 1,694 కు, పాజిటివ్ కేసులు 49,391కి చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. యాక్టివ్ కరోనా కేసులు 33,514 కాగా, గత 24 గంటల్లో 1,457 మంది కరోనా బాధితులు చికిత్సతో కోలుకున్నారని పేర్కొంది. ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 14,183కు చేరిందని, రికవరీ రేటు 28.72 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 548 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బందికి కరోనా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 548 మంది డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడినట్లు కేంద్ర ప్రభుత్వ అధికార వర్గాలు బుధవారం తెలిపాయి. వీరంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వారే. అయితే, వీరికి కరోనా ఎలా సోకిందన్న విషయాన్ని కేంద్రం నిర్ధారించలేదు. కరోనాతో కొందరు డాక్టర్లు కూడా మరణించారు. ఎంతమంది చనిపోయారో కేంద్రం బయట పెట్టడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో 69 మంది వైద్యులకు కరోనా సోకింది. ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ల ఎగుమతిపై నిషేధం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునే వ్యూ హంలో భాగంగా ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్ల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషే ధం విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(డీజీఎఫ్టీ) బుధవారం నోటి ఫికేషన్ జారీ చేశారు. ఈ తరహా శానిటైజర్లను విదేశాలకు ఎగుమతి చేయకుండా, భారత్‌లోనే విస్తృతంగా అందుబాటులో ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. గుజరాత్, మహారాష్ట్రలో పరిస్థితి ఆందోళకరం గుజరాత్, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కరోనా సంబంధిత మరణాలు భారీగా పెరుగుతుండడం పట్ల కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి నితిన్‌భాయ్ పటేల్, మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపేతో సమావేశమయ్యారు. ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించారు. కరోనా నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్న వారిని ముందుగానే గుర్తించి, చికిత్స అందించాలన్నారు. -
కోవిడ్ యోధులకు సెల్యూట్
సాక్షి, విశాఖపట్నం: కోవిడ్–19పై అలుపు లేకుండా ముందుండి పోరాడుతున్న యోధుల సేవలకు కృతజ్ఞతగా విశాఖలో నౌకాదళ హెలికాఫ్టర్ పూల వందనం సమర్పించింది. ఆస్పత్రుల్లో రాత్రిపగలు తేడా లేకుండా శ్రమిస్తున్న వైద్యులు, పారామెడికల్ సిబ్బందితోపాటు పారిశుధ్య సిబ్బంది, పోలీసులు, మీడియా సేవలను అభినందిస్తూ వాయుసేన ఆదివారం పూలవర్షం కురిపించి గౌరవ వందనం చేసింది. ► విశాఖ ఐఎన్ఎస్ డేగాలో బయలుదేరిన నేవీ హెలికాప్టర్ ప్రభుత్వ టీబీ, ఛాతీ ఆస్పత్రి, గీతం ఆస్పత్రులపై పూలవర్షం కురిపించింది. ► ఆస్పత్రుల బయట కరోనా యోధులకు నేవల్ ఆఫీసర్ ఇన్‌ఛార్జి కమెడోర్ సంజీవ్ ఇస్సార్ పుష్పగుచ్ఛాలు అందించి సెల్యూట్ చేశారు. వైద్యులు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ► బంగాళాఖాతం సముద్ర జలాల్లో ఐఎన్ఎస్ జలశ్వ యుద్ధ నౌకపై సెయిలర్లు ‘థాంక్యూ’ అంటూ ఇంగ్లిష్ అక్షరాకృతిలో నిలుచుని కోవిడ్ యోధులకు గౌరవ వందనం సమర్పించారు. ► ఐఎన్ఎస్ సావిత్రి యుద్ధనౌకలో సెయిలర్లు ప్లకార్డులు ప్రదర్శిస్తూ విన్యాసాలు నిర్వహించారు. ► రాత్రి 7.30 గంటలకు విశాఖ ఆర్కే బీచ్‌లో రెండు యుద్ధనౌకల్లో విద్యుత్ దీపాలు వెలిగించి కరోనాపై పోరాటం సాగిస్తున్న వారందరికీ వందనం సమర్పించారు. పచ్చరంగు కాంతి వెదజల్లే బాణసంచా కాల్చి ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నాం.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా కరోనా మహమ్మారికి అడ్డుకట్టే వేసేందుకు పూర్తిస్థాయిలో శ్రమిస్తున్నాం. వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. వైద్య సిబ్బందికి అందరి సహకారంతో పాటు ప్రశంసలు లభించడం ఆనందంగా ఉంది. – బి.వెంకటరమణ, ఛాతీ ఆసుపత్రి ఇన్చార్జి మా బాధ్యత పెరిగింది నౌకాదళం స్ఫూర్తితో మా బాధ్యత మరింత పెరిగింది. విశాఖలో వ్యాధి వ్యాప్తిని చాలావరకు నియంత్రించాం. వెయ్యి మందికిపైగా పారా మెడికల్ సిబ్బంది పనిచేస్తున్నారు. పోలీసులు, పారిశుధ్య కార్మికుల సహకారంతో కరోనా నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధ్దంగా ఉన్నాం’ – డాక్టర్ పీవీ సుధాకర్, ప్రిన్సిపల్ ఏఎంసీ -
పారా మిలటరీ సిబ్బంది లైవ్ లొకేషన్
న్యూఢిల్లీ: దేశ రక్షణ విషయంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పారా మిలటరీ దళాల్లో రెండు కరోనా పాజిటవ్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇంటి నుంచి పనిచేస్తున్న(వర్క్ ఫ్రం హోం), సెలవుల్లో ఉన్న పారా మిలటరీ దళాల సిబ్బంది వాట్సాప్ లైవ్ లోకేషన్ ద్వారా తమ జాడ తెలియజేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) విభాగం ఉన్నతాధికారులకు ఈ బాధ్యతలు అప్పగించింది. సెలవులను, ఇంటి నుంచి పని చేసేందుకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా సంబంధిత పారా మిలటరీ సిబ్బంది వారి ఇళ్లలోనే ఉండేలా చూడడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని సెంట్రల్ అర్మ్డ్ పోలీసు ఫోర్స్(సీఏపీఎఫ్) కమాండర్ ఒకరు తెలిపారు. -
కాంట్రాక్ట్ వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
-
కొనసాగుతున్న 108 సమ్మె
నడుస్తున్న సర్వీసులు డ్రైవర్లు విధుల్లోనే సమ్మెలో పారామెడికల్ సిబ్బంది బాధ్యతలు చూస్తున్న సీహెచ్‌సీలు కరీంనగర్ హెల్త్ : డిమాండ్ల సాధనకు చేపట్టిన 108 ఉద్యోగుల సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగింది. బుధవారం అర్ధరాత్రి నుంచి 108 సైరన్ నిలిచింది. సంస్థ పర్యవేక్షణ బాధ్యతలు ప్రభుత్వమే నిర్వహించాలని, ఉద్యోగులను క్రమబద్ధీకరించాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మెకు దిగారు. సమ్మె మూడు రోజులకు చేరుకున్న ప్రభుత్వం చర్చలకు పిలవకపోవడంతో ఆందోళనలు ఉధృతం చేయూలని ఉద్యోగుృు నిర్ణరుుంచారు. అరుుతే 108 సర్వీసులు మాత్రం నడుస్తూనే ఉన్నారుు. వీటి నిర్వహణ బాధ్యతలను సీహెచ్‌సీలు చూస్తున్నారు. ప్రమాదాల్లో గాయపడి సరైన సమయం లో చికిత్స అందక ప్రతిరోజు వందల సంఖ్యలో చనిపోతున్న వారి ప్రాణాలు కాపాడేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 108 అంబులెన్స్ వాహనాలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఆయన మరాణానంతరం 108 సర్వీసులు పాలకుల నిర్లక్ష్యానికి గురయ్యాయి. క్రమంగా ఈ పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడంతో పర్యవేక్షణ బాధ్యతలు కష్టంగా మారారుు. డీజిల్ నిండుకుని మధ్యలోనే నిలిచిన సందర్భాలు కోకొల్లలు. సిబ్బందికి వేతనాలు చెల్లించడంలో నిర్లక్ష్యంతోపాటు పనిగంటలు పెంచి శ్రమదోపిడీకి గురి చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటులో మంచి రోజులు వస్తాయనే ఆశతో ఉద్యమంలో నూ పాల్గొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నిరాశే మి గిల్చింది. దీంతో నిరాశకులోనైన ఉద్యోగులు ఉ ద్యమిస్తేనే బతుకులు బాగుపడతాయని సమ్మెబాట పట్టినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 32 వాహనాలు, 155 మంది జిల్లాలో 32 వాహనాలు ఉన్నారుు. వీటిలో చి గురుమామిడి, గోదావరిఖని వాహనాలు మరమ్మతులో మూలనపడ్డారుు. ప్రస్తుతం 30 వాహ నాలు నడుస్తుండగా.. 155మంది సిబ్బం ది పనిచేస్తున్నారు. వాహనాల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్న సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారనే సాకుతో నలుగురిని తొలగించారు. 108 ఉద్యోగుల డిమాండ్లు 108 వాహనాల నిర్వహణ ప్రభుత్వం తీసుకోవాలి. సిబ్బందిని క్రమబద్ధీకరించడంతోపాటు వేతనాలు పెంచాలి. విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను మళ్లీ తీసుకోవాలి కక్షసాధింపు చర్యలు మానుకోవాలి. డ్రైవర్లు విధుల్లోనే.. సమస్యలు పరిష్కరించాలని 108లోని పారామెడికల్ సిబ్బంది మాత్రమే సమ్మె చేస్తుండగా.. వాహన డ్రైవర్లు విధులు నిర్వహిస్తున్నారు. వాహనాల నిర్వహణ బాధ్యతను కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు(సీహెచ్‌సీ)లకు అప్పగించింది ప్ర భుత్వం. వాహనంలో వైద్య సేవలు అం దించే పారామెడికల్ సిబ్బందికి బదులుగా సీెహ చ్‌సీలు, పీహెచ్‌సీల పరిధిలోని రెండో ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లను వినియోగించుకుంటున్నారు. పగటిపూట రెండో ఏఎన్ఎంలు, రాత్రివేళల్లో హెల్త్ అసిస్టెంట్లు 108 వాహనాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 32 వాహనాలు పనిచేస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.