సాక్షి, అమరావతి: జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతోన్న మెడికల్, పారామెడికల్ సిబ్బంది నియామకాల విషయంలో ఎలాంటి పొరపాట్లూ జరగకూడదని, ఏ ఒక్క పోస్టు నియామకంలో తేడాలు వచ్చినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. మెరిట్ లిస్ట్‌లో అనర్హుల పేర్లు ఉన్నాయని విజయవాడలో జరిగిన నియామకాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)తో పాటు పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో మెరిట్‌లిస్ట్‌ను పున:పరిశీలన చేసి మళ్లీ ప్రకటించాలని అధికారులను వైద్యారోగ్య శాఖ ఆదేశించింది.
ఈ నేపథ్యంలో సిబ్బంది ఎంపికను అత్యంత పారదర్శకంగా చేయాలని కలెక్టర్లకు సూచించింది. వీలైనంత త్వరగా భర్తీ ప్రక్రియ ముగించి ఆస్పత్రుల్లో మెరుగైన సేవలు అందించాలని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ అధికారులను ఆదేశించారు.
ఒక్క పోస్టులో తేడా వచ్చినా కఠిన చర్యలు
Published Sun, Dec 6 2020 3:43 AM | Last Updated on Sun, Dec 6 2020 4:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment